ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో సముద్ర స్నానాలు

ABN, First Publish Date - 2020-12-01T06:05:32+05:30

కార్తీక పౌర్ణమి పర్వ దినాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లాలోని తీర ప్రాంతం భక్తులతో కిక్కిరిసి పోయింది.

భక్తులతో కిక్కిరిసిన తీరప్రాంతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైభవంగా పౌర్ణమి వేడుకలు

ఆలయాల్లో పూజలు

కొత్తపట్నం, నవంబరు 30: కార్తీక పౌర్ణమి పర్వ దినాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లాలోని తీర ప్రాంతం భక్తులతో కిక్కిరిసి పోయింది. భక్తులు వేల సంఖ్యలో జిల్లాలో సముద్ర తీరానికి వచ్చి పుణ్య స్నా నాలు ఆచారించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో స ముద్ర తీరం భక్తులతో కిటకిటలాడిపోయింది. కొత ్తపట్నం మండలంలోని పలు గ్రామాల సముద్ర తీరా ల వద్ద భక్తులు దూర ప్రాంతాల నుంచి పుణ్య స్నా నాలు ఆచిరించారు.  సముద్ర తీరం వద్ద భక్తులు ఇసుకతో సైకత లింగాలను ఏర్పాటు చేసుకుని దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. సముద్ర స్నానాలు ఆచరించిన అనంతరం ఆలయాల్లో భక్తులు  ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఒంగోలు(కల్చరల్‌):  కార్తీకమాసంలో విశేషమైన పౌర్ణమి, అంతే విశేషమైన సోమవారం కలిసిరావ టంతో భక్తులు దేవాలయాలకు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.  ఆయా ఆలయాల్లో మహిళలు పెద్దసంఖ్య లో  కార్తీకదీపాలను వెలిగించి ప్రత్యేకపూజలు నిర్వ హించారు. శ్రీగిరి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వెయ్యి కలశాలతో సహస్ర కలశాభిషేకం, ప్రత్యేక హోమం జరిగింది. సంతపేట సాయిబాబా మంది రంలో తితిదే గాయకులు ఇ నమనమె ళ్లూ రి మురళీకృష్ణ తన మధుర గానం తో భ క్తి గానార్చన నిర్వహించా రు. ప్రముఖ పురోహితులు మఠంపల్లి ద క్షిణామూర్తి యాజ్ఞీకంలో శివపార్వతుల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహిం చారు.  

మద్దిపాడు: గంగా పార్వతి కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కార్తీక పౌర్ణమి పూజలు మహిళలు ఎంతో భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహిం చారు. ఆలయ  ఆర్చకులు ఎన్‌.శ్రీనివాస కుమార్‌ ఆఽధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించారు. 

నాగులుప్పలపాడు:  చీర్వానుప్పలపాడులో వేంచే సి ఉన్న ఉమామహేశ్వరస్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.  స్వామి అ మ్మవార్లను గ్రామోత్పవంగా ఊరేగించారు. 

అద్దంకి:  కార్తీక పౌర్ణమి, సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చినకాశీగా పేరున్న మణికేశ్వరంలోని గంగా బ్రమరాంభ సమేత మల్లేశ్వరస్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించు కొని అభిషేకాలు నిర్వహించారు. మల్లేశ్వరస్వామిని మాజీ ఎమ్మెల్యే గరటయ్య, కృష్ణచైతన్య దర్శించుకు న్నారు. శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని  కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష తమలపాకులతో అలంకరించారు.

బల్లికురవ:  మండలంలోని గుంటుపల్లి, ము క్తేశ్వరం, కొమ్మినే నవారిపా లెం, చె న్నుపల్లి, కొండా యపాలెం, కొణి దెన, వేమవరం నక్కబొక్కలపాడు గ్రామాల్లో శివా లయాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు.

సంతమాగులూరు: మండలంలోని మిన్నెకల్లు, ఏ ల్చూరు, కొప్పరం, పాతమాగులూరు గ్రామాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. 

Updated Date - 2020-12-01T06:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising