ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా కార్తీక పూజలు

ABN, First Publish Date - 2020-12-15T06:28:55+05:30

కార్తీక సోమవారం పూజలను మండలంలోని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

పూజలందుకుంటున్న త్రిపురాంతకేశవుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్రిపురాంతకం, డిసెంబరు 14 : కార్తీక సోమవారం పూజలను మండలంలోని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కార్తీక మాసంలోని చివరి సోమవారం కావడంతో భ క్తులు ఉదయాన్నే పుణ్య స్నానాలు ఆచరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో ప్రదక్షణలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్ల కింద, చామరకర్ణ రససిద్ధి గణపతి వద్ద దీపాలను వెలిగించారు. అనంతరం త్రిపురాంతకేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిపురాంతకేశ్వరుడు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయానికి అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు విశ్వంస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీబాలా త్రిపురసుందరీదేవి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు చినమస్తాదేవికి, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. కొత్తఅన్నసముద్రంలోని శివాలయంలో భక్తులు స్వామివారికి ఘటాభిషేకం నిర్వహించారు.

గిద్దలూరు టౌన్‌ : కార్తీక మాసం సోమవారం చివరి రోజు కావడంతో దేవాలయాలలో భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. చివరి సోమవారం, అమావాస్య కావడంతో దేవాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా వనభోజనాలను నిర్వహించారు. పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీపాతాళ నాగేశ్వరస్వామి దేవాలయం, కేఎ్‌సపల్లె సమీపంలోని ఎగువ భీమలింగేశ్వరస్వామి దేవాలయం, బురుజుపల్లె సమీపంలోని పలుపులవీడు, గడికోటలోని శివాలయంలో, పలు శైవక్షేత్రాలు, వివిధ దేవాలయాలలో భక్తుల తాకిడి కనిపించింది.

Updated Date - 2020-12-15T06:28:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising