ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండిపైన బండెక్కే.. ట్రాఫిక్‌లో చిక్కే!

ABN, First Publish Date - 2020-08-11T15:50:45+05:30

పట్టణంలో నిత్యం ఏర్పడుతున్న ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు ఇబ్బందులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరిలో నిత్యం ట్రాఫిక్‌ రద్దీ


కనిగిరి(ప్రకాశం): పట్టణంలో నిత్యం ఏర్పడుతున్న ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి 565 నిర్మించాక(కనిగిరి పట్టణ అవ తల మినహా) సుదూర ప్రాంతాల నుంచి హైవేపై వచ్చే భారీ వాహనాలు, అతి భారీ వాహనాలు కనిగిరిలో నుం చే వెళ్లాల్సి ఉంది. ఈనేపథ్యంలో సోమవారం సాయం త్రం గ్రానైట్‌ రాళ్లు తరలించే భారీ టిప్పర్లను 26 టైర్లు కలిగిన అతి భారీ లారీపైన ఎక్కించుకుని తరలించే క్రమంలో పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో ట్రాఫిక్‌కు అంత రాయం ఏర్పడింది. దీంతో పోలీసులు నాలుగు రోడ్ల నుంచి వచ్చే వాహనాలను నిలిపివేసి వాటిని మళ్లించారు. దాదాపు 5 వాహనాలు ఇదే మాదిరిగా విద్యుత్‌లైన్లను తప్పిస్తూ వెళ్లాల్సి వచ్చింది. 


ఏళ్లు గడిచినా సాగని ఎన్‌హెచ్‌ 565 నిర్మాణం

కాశిరెడ్డి కాలనీ పెద్ద చెరువు సమీపంలో నుంచి నేషనల్‌ 565 హైవే కొత్తూరు మీదుగా పామూరు వైపు రోడ్డు గతంలో మంజూరైంది. ఈ రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోయే వారికి సరైన నష్టపరిహారం అందించకపోవడంతో కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. ఈ వ్యవహారం ఎనిమిదేళ్ల నుంచి సాగుతూనే ఉంది. కర్నూలు, చైన్నై, బెంగళూరు, తిరుపతి, చిత్తూరు నుంచి హైవేపై భారీ, అతిభారీ వాహనాలు ఈ రోడు మీదుగా పట్టణంలో నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్తున్నాయి. దీంతో స్థానిక పామూరు, ఒంగోలు బస్టాండుల్లో నిరంత రం ట్రాఫిక్‌ నిలిచిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు.


Updated Date - 2020-08-11T15:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising