ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటిని జంతువులు కూడా తినవు!

ABN, First Publish Date - 2020-04-28T17:19:17+05:30

‘అవి బియ్యమా! జంతువులు కూడా తినవు!..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జర్నలిస్టులకు అలాంటి బియ్యమా? 

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విచారణ

కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి 


కందుకూరు(ప్రకాశం): ‘అవి బియ్యమా! జంతువులు కూడా తినవు! జర్నలిస్టులకు ఇచ్చేది ఇలాంటి పురుగులు పట్టినవా!’ అని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ సమయంలో జర్నలిస్టులకు సాయంగా ప్రభుత్వం అందించిన బియ్యంలో నాణ్యతా లోపంపై ఆయన ఘాటుగా స్పందించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలంటూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే ఇటీవల జర్నలిస్టులకు ఇచ్చిన బియ్యం నాసిరంగా ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ చేయించి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని కోరతానన్నారు. నిత్యావసరాల పేరుతో పురుగులు పట్టిన నూకల బియ్యం, నాణ్యత లేని కందిపప్పు, నూనె సరఫరా చేయడం అవమానించడమేనని పేర్కొన్నారు. పేరుకే బియ్యం కానీ వాస్తవానికి అవి పురుగుల నూకలని, అవి జంతువులు కూడా తినలేవని ఎమ్మెల్యే విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు కొల్లూరి హరిబాబు, కిష్టాఫర్‌  పాల్గొన్నారు.  

Updated Date - 2020-04-28T17:19:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising