ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం వెళ్లే భక్తులకు వసతి ఏర్పాటు

ABN, First Publish Date - 2020-12-06T05:58:43+05:30

శ్రీశైలం వెళ్లే భక్తులకు దోర్నాలలోని హరేకృష్ణ దేవాలయంలో వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ కమిటి తెలిపింది.

ఇస్కాన్‌ ప్రతినిధి బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్కాన్‌ ప్రతినిధి బృందం

పెద్ద దోర్నాల, డిసెంబరు 5 : దక్షిణాధి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకు దోర్నాలలోని హరేకృష్ణ దేవాలయంలో వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ కమిటి తెలిపింది. స్థానికంగా నూతనంగా నిర్మిస్తున్న హరేకృష్ణ దేవాలయాన్ని అనంతపురం, రాజమండ్రి ఇస్కాన్‌ మందిరాల ప్రతినిధులు దామోదరగౌరంగ్‌దాస్‌, శ్యామంగా గౌరంగ్‌దాస్‌, మధ్యాహ్న భోజనపథకం దక్షిణభారత్‌ డైరక్టర్‌ మధుగోపాల్‌దాస్‌ శనివారం సందర్శించారు.  ఈ సందర్భంగా ఆలయకమిటీ పెద్దలతో ఆలయ నిర్మాణం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం వెళ్లేందుకు రాత్రి 9 గంటల సమయం దాటితే అటవీ శాఖ నుంచి అనుమతులు లేవని దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆలయంలో భోజనవసుతులు ఏర్పాటు  చేయాలని సూచించారు.  కార్యక్రమంలో జడ్‌పీటీసీ మాజీసభ్యులు రామిరెడ్డి, హరేకృష్ణ సంస్థ నిర్వాహకులు నిమ్మైదాస్‌, కమిటి పెద్దలు తొమ్మండ్రు వెంకటేశ్వర్లు, ఒంటేరు రమణ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:58:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising