ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నివర్‌తో రోడ్లు రివర్స్‌

ABN, First Publish Date - 2020-11-30T06:04:14+05:30

నివర్‌ తుపాను దెబ్బంతో ప లు మండలాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయి. నడిచేందుకు వీలు లేకుండా తయారయ్యాయి.

ఉప్పుగుండూరు-మాచవరం మధ్య ధ్వంసమైన రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వరదలకు దెబ్బతిన్నరోడ్లు 

గోతులమయంగా రహదారులు

ఇబ్బందిపడుతున్న ప్రజలు


అద్దంకి, నవంబరు 29 : నివర్‌ తుపాను దెబ్బంతో ప లు మండలాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయి. నడిచేందుకు వీలు లేకుండా తయారయ్యాయి.  అద్దంకి సమీపంలో దర్శి రో డ్డుపై గోతులు పెరగడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.  మరమ్మతులు చేసినా కొద్ది పాటి వర్షానికే గోతు లు పడుతున్నాయి. అద్దంకి - దర్శి రోడ్డులో శం కరాపురం వరకు  సుమారు 5 కి.మీ దూరం ప డిన గోతులతో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. చెరువుకొమ్ముపాలెంలో నల్లవాగు వ ద్ద కోతకు గురై రాకపోకలకు ఇబ్బందిగా మా రింది. పేరాయపాలెం వద్ద దోర్నపువాగుపై బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో ఏ సమయంలో కూ లుతుందోనని వాహనచోదకులు భయపడుతు న్నారు.  శాంతినగర్‌ - మైలవరం, గోవాడ రోడ్లు అధ్వానంగా మారాయి. పాడైన రోడ్లను వెంటనే బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు. 

బల్లికురవ : తుపాను తాకిడికి మండలం లోని పలు రోడ్లు ఛిద్రమయ్యాయి. ప్రధానంగా బల్లికురవ-మార్టూరు, బల్లికురవ-కొణిదెన, మా ర్టూరు-కొణిదెన, ఉప్పుమాగులూరు- బల్లికురవ, సంతమాగులూరు-చెన్నుపల్లి, వైదన-కొప్పెరపా డు, వినుకొండ-కొప్పెరపాడు, వెలమవారిపా లెం గ్రామాల మధ్య తారురోడ్లు పూర్తిగా ధ్వం సమయ్యాయి. వెంటనే మరమ్మతు చర్యలు చే పట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

 చీరాల : ఇటీవల కురిసిన వర్షాలకు పలు రహదారులు దెబ్బతిన్నాయి. ప్రధానంగా ఈపు రుపాలెం స్ట్రయిట్‌ కట్‌ బ్రిడ్జిపైన, బ్రిడ్జికి ఇరు వైపులా రోడ్డులో అడుక్కోగుంత ఏర్పడింది.  దీంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. 

నాగులుప్పలపాడు: నివర్‌ తుపాను నాగు లుప్పలపాడు మండలంలో రహదారులు పూర్తి గా దెబ్బతిన్నాయి. మద్దిరాల వాగు సమీపంలో రోడ్డు కోతకుగురైంది. తారు లేచిపోయి కంకర రాళ్ళు పైకి లేచి ఇంకొల్లు రహదారిలో రాక పోకలు పూర్తిగా స్తంభించాయి. మత్స్యకార గ్రా మాల్లో వరద ధాటికి అంతర్గత రోడ్లన్నీ ఛిద్ర మయ్యాయి.  


Updated Date - 2020-11-30T06:04:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising