ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగులను నిర్లక్ష్యం చేయవద్దు

ABN, First Publish Date - 2020-12-04T05:10:58+05:30

విభిన్న ప్రతిభావంతులను మనతోపాటు సమానంగా చూడాలని మండల విద్యాశాఖాధికారి కావడి వెంకటేశ్వర్లు అన్నారు.

దివ్యాంగులకు బహుమతులు అందచేస్తున్న ఎంఈవో వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమరోలు, డిసెంబరు 3 : విభిన్న ప్రతిభావంతులను మనతోపాటు సమానంగా చూడాలని మండల విద్యాశాఖాధికారి కావడి వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని తాటిచెర్ల జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రపంచ విభిన్న ప్రతిభవంతుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులను ఎవరూ నిర్లక్ష్యం చేయరాదన్నారు. వారు అన్ని రంగాలలో రాణించేందుకు తగిన సహాయ సహకారాలను అందించాలన్నారు.  కార్యక్రమంలో హెచ్‌ఎం శేషుకుమార్‌, ఎంఐఎస్‌ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


కంభం :  స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బోర్డు స్కూలులోని భవిత కేంద్రంలో గురువారం ప్రపంచ విభిన్న ప్రతిభవంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు పి.మాల్యాద్రి మాట్లాడుతూ.. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని, పట్టుదలతో ఎవరైనా, ఏదైనా సాధించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అబ్దుల్‌సత్తార్‌, ప్రత్యేక ఉపాధ్యాయురాలు నూర్జహాన్‌, రంగస్వామి, ఫిజియోథెరపిస్టు సంధ్యరాణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


ఎర్రగొండపాలెం : ప్రత్యేక అవసరాలున్న విద్యార్ధుల పట్ల చిన్న చూపు తగదని వారి పట్ల మంచి ఆదరణ చూపాలని ఎంఈవో పి ఆంజనేయులు అన్నారు. గురువారం వికలాంగుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు దాతల సహకారంతో బ్యాగులు, స్లీల్‌ ప్లేట్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


పెద్ద దోర్నాల : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఎంఈవో కార్యాలయంలో అంతర్జాతీయ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.   ఈ సందర్భంగా వారికి కబడ్డీ, పరుగుపందెం వంటి ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. వికలాంగ ఉఫాధ్యాయులు గురవారెడ్డిని శాలువాలతో సత్కరించారు.  కార్యక్రమంలో ఎంఈవో మస్తాన్‌నాయక్‌, ప్రధానోఫాధ్యాయులు ఏవీహెచ్‌ ప్రసాద్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T05:10:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising