ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైవేల కోసం భూములు ఇచ్చిన వారికి పరిహారం చెల్లించాలి : జేసీ

ABN, First Publish Date - 2020-11-13T06:00:55+05:30

జిల్లాలో జాతీయ రహదా రుల నిర్మాణాల కోసం భూములు ఇచ్చిన రైతులు, ఇంటి యజమాను లను తమ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం మంచి పద్ధతి కాదని, వెంటనే పరిహారం చెల్లించాలని జేసీ వెంకటమురళీ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



 ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 12 : జిల్లాలో జాతీయ రహదా రుల నిర్మాణాల కోసం భూములు ఇచ్చిన రైతులు, ఇంటి యజమాను లను తమ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం మంచి పద్ధతి కాదని, వెంటనే పరిహారం చెల్లించాలని జేసీ వెంకటమురళీ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన భవన్‌లో రెవెన్యూ అధికా రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడు తూ సామాజిక ప్రయోజనాల కోసం రహదారులు నిర్మాణానికి భూ మి ఇచ్చిన వారికి తక్షణమే పరిహారం చెల్లించాలని ఆదేశించారు. రో డ్లు నిర్మించినప్పటికి బాధితులకు ఇంతవరకు సొమ్మును చెల్లించలే దని ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బందులు పెడితే ప్రభుత్వంపై నమ్మ కం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. గిద్దలూరు నుంచి గుంటూరు వరకు నిర్మిస్తున్న రహదారికి 235 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉం దని చెప్పారు. పోరుమమిళ్ళ నుంచి సింగరాయకొండ వరకు నిర్మి స్తున్న జాతీయ రహదారి  167 బి విస్తరణ పనులు వేగంగా చేయా లన్నారు. సమావేశంలో సబ్‌కలెక్టర్‌ భార్గవ్‌తేజ్‌, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, ఉపకలెక్టర్‌ గ్లోరియా పాల్గొన్నారు. 


వెలిగొండ పునరావాస పనులు వేగవంతం  

వెలిగొండ నిర్వాసితుల కోసం పునరావాస పనులు వేగవంతం చే యాలని జేసీ వెంకటమురళి ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌ లో ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్వాసితులకు వచ్చే గురువారం నాటికి ఇళ్ల స్థలాలు పంపిణీ పూర్తి చేయాలని, పరిహరం పొందే వా రి జాబితా సిద్ధంగా ఉంచాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో తొలుత వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కోసం ఆప్షన్‌ ఇచ్చి, తరువాత దానిని మార్చు కున్నారని అధికారులు జేసీ దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ప్ర త్యేక కలెక్టర్‌ జి.కృష్ణవేణి, ఎస్‌డీలు గ్లోరియా, చంద్రలీల, ప్రాజెక్టు ఈ ఈ నగేష్‌, కంభం, మార్కాపురం ఏఈలు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-13T06:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising