ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రేన్‌ చైన్‌ తెగిపడి ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2020-12-08T04:00:28+05:30

గ్రానై ట్‌ ఫ్యాక్టరీలో క్రేన్‌ చైన్‌ తెగి రాయి పడడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది.

ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఉప్పుమాగులూరులోని గ్రానైట్‌  ఫ్యాక్టరీలో ప్రమాదం

బల్లికురవ, డి సెంబరు 7 : గ్రానై ట్‌ ఫ్యాక్టరీలో క్రేన్‌ చైన్‌ తెగి రాయి పడడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. వివరాల్లో వెళి తే.. మండలంలోని ఉప్పుమాగులూరు గ్రామ పరిధిలో ఉన్న గ్రానైట్‌ ఫ్యాక్టరీలో ఒడిసా రాష్ట్రానికి చెందిన కూలీలు శ్యాంసుందర్‌(21), విజయ్‌సింగ్‌(22) పనిచేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వ్యాపారి చక్రతేజ గ్రానైట్‌ పేరుతో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. అందులో ఒడిసాకు చెందిన శ్యాంసుందర్‌, విజయ్‌సింగ్‌ పనిచేస్తుండగా రాయిని పైకిలేపే క్రమంలో క్రేన్‌ చైన్‌ తెగిపోయింది. ఒక్కసారిగా రాయి వారిపై పడింది. శ్యాంసుందర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, విజయ్‌సింగ్‌ను చిలకలూరిపేట వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఇద్దరు మృతదేహాలను చిలకలూరిపేట వైద్యశాలలో ఉంచారు. ఎస్‌ఐ శివనాంచారయ్య గ్రానైట్‌ ఫ్యాక్టరీకి వెళ్లి పరిశీలించారు. మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతులిద్దరి బంధువులు వచ్చిన తర్వాత వారిచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ చెప్పారు.


Updated Date - 2020-12-08T04:00:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising