ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారులో మద్యం తరలిస్తున్న సేల్స్‌మన్‌

ABN, First Publish Date - 2020-12-02T04:01:16+05:30

అద్దంకి పట్టణంలోని పాత పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఉన్న మద్యం షాపులో సేల్స్‌మన్‌గా పనిచేసే చలమారెడ్డి మద్యం బాటిళ్లు తీసుకువెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు.

మద్యం బాటిళ్లతో వెళ్తూ ప్రమాదానికి గురైన కారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆటోను ఢీకొట్టడంతో అక్రమం బట్టబయలు

అద్దంకిలో అడ్డంగా దొరికిన షాప్‌ నిర్వాహకుడు

అద్దంకి, డిసెంబరు 1 : అద్దంకి పట్టణంలోని పాత పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఉన్న మద్యం షాపులో సేల్స్‌మన్‌గా పనిచేసే చలమారెడ్డి మద్యం బాటిళ్లు తీసుకువెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు. వివరాలలోకి వెళితే.. మండలంలోని కలవకూరుకు చెందిన చలమారెడ్డి అద్దంకిలోని పాత పెట్రోల్‌బంక్‌ సమీపంలో ఉన్న మద్యం షాపులో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తూ 40 మద్యం బాటిళ్లను కారులో తీసుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో నామ్‌రోడ్డులో రాంగ్‌రూటులో వెళ్తున్న సమయంలో సబ్‌స్టేషన్‌ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. ప్రమాద విషయం తెలుసుకొని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన చలమారెడ్డి కం గారు పడటంతో పోలీసులు కారులో పరిశీలించగా మ ద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు ఎస్‌ఈబీ అధికారులకు సమాచారం ఇచ్చామని ఎస్‌ఐ తెలిపారు. మద్యం షాపులో పనిచేసే ఈ ఉద్యోగి కారులో మద్యం తీసుకు వెళ్లి బెల్ట్‌ షాపు నిర్వాహకులకు అందజేస్తుంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా పలుసార్లు మద్యం షాపులలో పనిచేసే సిబ్బంది మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

Updated Date - 2020-12-02T04:01:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising