ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం

ABN, First Publish Date - 2020-11-30T05:44:38+05:30

నివర్‌ తు ఫాన్‌ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.

తడిసిన మిరప కాయలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎమ్మెల్యే కుందురు

మార్కాపురం, నవంబరు 29: నివర్‌ తు ఫాన్‌ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలో తిప్పాయపాలెం, మిట్టమీదపల్లె తదితర గ్రామాలలో ఆదివారం దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ అకాల వర్షాలతో దెబ్బతి న్న పంటల జాబితాలను వ్యవసాయాధికారులు వెంటనే సిద్ధంచేయాలన్నారు. డిసెంబర్‌ నెలాఖరుకు పంట నష్టపరిహారం అం దించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్న ట్లు తెలిపారు. 33శాతం కన్నా ఎక్కువ పంట నష్ట పోయిన రైతులు వెంటనే తమ పంట వివరాలను వ్యవసాయాధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో లక్ష్మీనారాయణ, వైసీపీ నాయకులు బండి కృష్ణారెడ్డి త దితరులు పాల్గొన్నారు. 

దెబ్బతిన్న పంటలను

 నమోదు చేయాలి

తర్లుపాడు : తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న పంటలను వెంటనే న మోదు చేయాలని ఎమ్మె ల్యే నాగార్జునరెడ్డి వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. మండలంలోని సీతానాగులవరంలో దెబ్బతిన్న శనగ పంటను ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. శనగ, మిర్చి పంట ఎందుకూ పనికి రాకుండా పోయిందని రైతులు ఎమ్మెల్యే ముందు ఆవేదన చెం దారు. దెబ్బతిన్న పంటలకు పరిహారం మం జూరు కోసం నమోదు చేయాలని ఏవో చం ద్రశేఖర్‌ను ఆదేశించారు. ఆయన వెంట మా జీ సర్పంచ్‌ రామసుబ్బారెడ్డి, పలువురు వైసీ పీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T05:44:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising