ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో రెండు కేంద్రాల్లో మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లు

ABN, First Publish Date - 2020-07-09T10:29:19+05:30

జిల్లాలోని మరో రెండు వేలం కేంద్రాల్లో మార్క్‌ఫెడ్‌ గురువారం నుంచి పొగాకు కొను గోళ్లను చేపట్టనుంది. ఇప్పటి వరకు ఒంగోలులోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లంపల్లి, టంగుటూరు-2లో నేడు ప్రారంభించనున్న ఎండీ ప్రద్యుమ్న 

కందుకూరు-2లో రైతుల నిరసన 


ఒంగోలు, జూలై 8 (ఆంధ్రజ్యోతి) :  జిల్లాలోని మరో రెండు వేలం కేంద్రాల్లో మార్క్‌ఫెడ్‌ గురువారం నుంచి పొగాకు కొను గోళ్లను చేపట్టనుంది.  ఇప్పటి వరకు ఒంగోలులోని రెండు, పొది లి, కొండపి, డి.సి. పల్లిలో మాత్రమే ఆ సంస్థ కొనుగోళ్లు చేస్తున్న విషయం విదితమే. వాటిలో లోగ్రేడ్‌ బేళ్లను మార్క్‌ఫెడ్‌  కొన డం వల్ల రైతులకు కొంత ఊరట లభించింది. దీంతో తమ ప్రాం తంలో కూడా కొనాలని ఆయా వేలం కేంద్రాల రైతులు మార్క్‌ ఫెడ్‌ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.


ఈ నేపథ్యంలో  గురువారం నుంచి  వెల్లంపల్లి, టంగుటూరు-2 కేంద్రాల్లో కొను గోళ్లు చేపట్టనున్నారు. వీటిని ఆ  సంస్థ ఎండీ అయిన మార్కె టింగ్‌శాఖ  కమిషనర్‌  ప్రద్యుమ్న గురువారం  ప్రారంభించను న్నారు. అలాగే ఒంగోలులోని ఆర్‌ఎం కార్యాలయంలో  రైతులతో భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ మేలు రకం బేళ్ల కోసం పోటీపడిన  వ్యాపారులు  ప్రస్తుతం కాస్తంత జోరు తగ్గించారు.  ఈక్రమంలో సరైన  ధరలు లభించడం లేదంటూ కందుకూరు-2 వేల కేంద్రం రైతులు గురువారం నిరసన తెలిపారు. వేలాన్ని అడ్డుకున్నారు.  

Updated Date - 2020-07-09T10:29:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising