అట్టహాసంగా ఏలూరి వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం
ABN, First Publish Date - 2020-12-12T04:31:31+05:30
టీడీపీ ఒంగోలు పార్లమెంట్ తెలుగు రైతు అధ్య క్షుడిగా నియమితులైన ఏలూరి వెంకటేశ్వ ర్లు ప్రమాణ స్వీకారం మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గురు వారం రాత్రి అట్టహాసంగా జరిగింది.
పామూరు, డిసెంబరు 11 : టీడీపీ ఒంగోలు పార్లమెంట్ తెలుగు రైతు అధ్య క్షుడిగా నియమితులైన ఏలూరి వెంకటేశ్వ ర్లు ప్రమాణ స్వీకారం మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గురు వారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి నియో జకవర్గం నుంచి నాయకులు, ముఖ్య కా ర్యకర్తలు తరలివెళ్లారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతుల మీదుగా ఏలూరి వెంకటేశ్వర్లు నియా మ కపత్రం, షీల్డ్‌ను అందుకున్నారు. అన్నదా తలు పడుతున్న కష్టాలు తెలుసుకొని క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి వా రి సమస్యల పరిష్కారానికి కృషి చేయా లని లోకేష్ సూచించినట్లు ఆయన తెలిపారు. తనపై ఎంతో నమ్మ కంతో జిల్లా స్థాయి రైతు సంఘం అధ్య క్షుడు పదవి ఇచ్చినందుకు పార్టీ అధిష్టానానికి రుణ పడి ఉంటూ పా ర్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సం దర్భంగా ఏలూరి వెంకటేశ్వర్లను మండ ల, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పువ్వాడి వెం కటేశ్వర్లు, బీవీ భోజయ్యచారి, జిల్లా షీప్ సొసైటీ డైరెక్టర్ ఎం.గంగరాజు యాదవ్, మైనార్టీ సెల్ జిల్లా మాజీ ప్రధాన కా ర్యదర్శి ఎస్‌డీ అమీర్‌బాబు, కంభాల దిన్నె, వగ్గంపల్లి, తూర్పు కోడిగుడ్లపాడు పార్టీ అ ధ్యక్షుడు మన్నం రమణయ్య, వెంకట రమణారెడ్డి, మాధవరావు, మాజీ కో- ఆప్షన్ సభ్యుడు షేక్ ఖాజా రహంతుల్లా, మాజీ ఉప సర్పంచ్‌లు గుంటుపల్లి శ్రీని వాసులు, చావా సుబ్బారావు, మాజీ ఎంపీటీసీ గోళ్ల కొండయ్య, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు ఏలూరి నరసింహారావు, రామారావు, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, రమణయ్య, వెంకటేశ్వర్లు అభినందించారు.
Updated Date - 2020-12-12T04:31:31+05:30 IST