ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లుల షాక్‌..రెట్టింపైన విద్యుత్‌ చార్జీలు

ABN, First Publish Date - 2020-05-09T09:13:59+05:30

కరోనా కాలంలో విద్యుత్‌ బిల్లులు షాక్‌ కొడు తున్నాయి. ఎగువ మధ్యతరగతికి సైతం చార్జీలు చుక్కలు చూపెడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకేసారి రీడింగ్‌ తీయడంతో మారిన స్లాబ్‌

లాక్‌డౌన్‌లో పెరిగిన వినియోగం

ఆపై బిల్లుల చెల్లింపులో ఆలస్యంపై ఫైన్‌

గతనెల నుంచి కొత్త టారిఫ్‌ అమలు

లబోదిబోమంటున్న వినియోగదారులు

ఇక నుంచి నెలవారీ టారిఫ్‌: ఎస్‌ఈ


‘మూలిగే నక్కపై తాటికాయపడ్డట్లు’ చందంగా కరోనాతో  జనం అష్టకష్టాలు పడుతున్న సమయంలో విద్యుత్‌ బిల్లులు మోత మోగిస్తున్నాయి. ప్రస్తుతం మీటరు రీడింగ్‌ తీసి బిల్లులు ఇస్తున్నారు. చాలావరకు రెట్టింపు చార్జీలు వస్తున్నాయి. రెండు నెలల రీడింగ్‌ ఒకేసారి తీయడంతో స్లాబ్‌ మారి చార్జీలు తడిసిమోపెడవుతున్నాయని వినియోగదారులు గగ్గోలుపెడుతున్నారు. విద్యుత్‌శాఖ సూచించిన ప్రకారం మార్చి బిల్లును ఫిబ్రవరి లెక్కన చాలామంది చెల్లించారు.


మిగతా వారు మార్చి, ఏప్రిల్‌కు సంబంధించి ఒకేసారి చెల్లింపులు చేయాల్సి వచ్చింది. ఇందుకు అదనంగా ఫైన్‌ కలుపుతున్నారు. పైపెచ్చు ఏప్రిల్‌ నుంచి కొత్త టారిఫ్‌ అమలులోకి వచ్చింది. అంతా కలిసి బిల్లులు భారీగా వస్తుండటంతో వినియోగదారులు విస్తుపోతున్నారు.  అధికారులు మాత్రం వినియోగం పెరిగినందునే బిల్లులు పెరిగాయంటూ చెప్పుకొస్తున్నారు.


ఒంగోలు (క్రైం), మే 8: కరోనా కాలంలో విద్యుత్‌ బిల్లులు షాక్‌ కొడు తున్నాయి. ఎగువ మధ్యతరగతికి సైతం చార్జీలు చుక్కలు చూపెడు తున్నాయి. లాక్‌డౌన్‌ పాక్షిక సడలింపులతో విద్యుత్‌ రీడింగ్‌లు తీయడం ప్రారంభమైంది. అయితే గతం కంటే రెట్టింపు బిల్లులు వస్తున్నాయి. గత రెండు నెలల బిల్లులు ఒకేసారి తీయడం వల్ల స్లాబ్‌ మారి బిల్లులు తడిసి మోపెడు అవుతున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో గత నెల నుంచి విద్యుత్‌ బిల్లుల చెల్లింపులలో మార్పులు రావడం మరింత భారంగా మారింది.


గతంలో ఏడాది యూనిట్‌గా టారీఫ్‌ ఉండేది. అయితే ప్రసుతం ఏప్రిల్‌ నుంచి ఏ నెలకు ఆ నెల టారిఫ్‌ నిర్ణయించడంతో కరెంట్‌ బిల్లులు అధికమయ్యాయి. అదేక్రమంలో లాక్‌డౌన్‌ కారణంగా మార్చిలో రీడింగ్‌లు తీయకుండా ఫిబ్రవరి బిల్లు ఎంత వస్తే అంత చెల్లించాలని అధికారులు తెలిపారు. దీంతో ప్రసుతం చెల్లింపులు సమయంలో వస్తున్నా భారీ బిల్లులు చూసి వినియోగదారులు లబోది బోమంటున్నారు. పైపెచ్చు రెండు నెలల బిల్లు కట్టడానికి వెళితే అదనంగా వంద ఫైను పడుతుండటంతో ఏంచేయలేక ఆ మొత్తం చెల్లించి వస్తున్నారు.


గత నెల నుంచి కొత్త టారిఫ్‌ అమలు 

గతనెల నుంచి కొత్త టారిఫ్‌ అమలులోకి వచ్చింది. దీంతో 500 యూనిట్లు విద్యుత్‌ వినియోగించే వినియోగదా రులకు 90పైసలు అదనంగా భారం పడుతుంది. అదే సమయంలో గతంలో ఏడాది వినియోగించిన యూనిట్లు సరాసరి చూసి స్లాబులు ఉండేవి. కానీ ప్రస్తుతం ఏనెల వినియోగం ఆ నెలలోనే కేటగిరీలు నిర్ణయించి చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో వేసవిలో విద్యుత్‌ వినియోగం సాధారణంగానే పెరుగుతుంది. ఈ మేరకు బిల్లులు ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. 

Updated Date - 2020-05-09T09:13:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising