కరోనాపై నిర్లక్ష్యం వద్దు
ABN, First Publish Date - 2020-03-27T10:19:04+05:30
కరోనాపై నిర్లక్ష్యం వద్దని తహసీల్దార్ సీహెచ్ నాగభూషణం అన్నారు. విదేశాలనుంచి గురువారం నాగులుప్పలపాడు
నాగులుప్పలపాడు, మార్చి 26 : కరోనాపై నిర్లక్ష్యం వద్దని తహసీల్దార్ సీహెచ్ నాగభూషణం అన్నారు. విదేశాలనుంచి గురువారం నాగులుప్పలపాడు మండలానికి వచ్చిన వారికి నోటీసులు అందజేశారు. ఆయన వెంట ఎస్‌ఐ జి.సోమశేఖర్, ఎంపీడీవో ఎం, రాజేష్‌బాబు, ప్రభుత్వ డాక్టర్ ప్రమోద్ ఉన్నారు. కరోనా లక్షణాలు లేనటువంటివారు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. కుటుంబ సభ్యులు సామాజిక దూరం పాటిస్తూ బయటకు రాకుండా ఉండేలా హామీ పత్రంపై సంతకం చేయించి నోటీసులు అందజేశారు. ఇండోనేషియా నుంచి ఉప్పుగుండూరు వచ్చిన వ్యక్తిని ఇంటి నుంచి బయటకు రావద్దంటూ ఆదేశాలు ఇచ్చారు.
జామియా మసీదు నుంచి ఆమ్మనబ్రోలు వచ్చిన వారితో ఎస్‌ఐ సోమశేఖర్ మాటామంతీ జరిపారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని సూచంచి అక్కడ నుండి పంపించివేశారు. ఉప్పుగుండూరులో గురువారం కూరగాయల సంత నిర్వహించారు. అక్కడికి పెద్ద ఎత్తున కొనుగోలుదారులు వస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పలు సందేశాలను అందించారు. గుంపులు, గుంపులుగా ఉండరాదని, సామాజిక దూరం పాటించాలని, క్యూ పద్ధతిలో కూరగాయలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Updated Date - 2020-03-27T10:19:04+05:30 IST