నీ అంతు చూస్తా.. ఖబడ్దార్...!
ABN, First Publish Date - 2020-12-31T04:12:49+05:30
‘‘ముఖ్యమంత్రినే విమర్శిస్తావా, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తావా, నీ అంతు చూస్తా, ఖబడ్దార్ స్వామి’’ అంటూ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామిని హెచ్చరించారు.
ఎమ్మెల్యే స్వామిని హెచ్చరించిన వెంకయ్య
టంగుటూరు, డిసెంబరు 30 : ‘‘ముఖ్యమంత్రినే విమర్శిస్తావా, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తావా, నీ అంతు చూస్తా, ఖబడ్దార్ స్వామి’’ అంటూ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామిని హెచ్చరించారు. జమ్ములపాలెంలో బుధవారం ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ సభ ముగియగానే అదే వేదిక నుంచి వెంకయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే స్వామిపై నిప్పులు చెరిగారు. పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గంలో టీడీపీ వారు ఇళ్ల స్థలాలు పంపిణీ కాకుండా నిలిపివేసిన 10, 15 లేఅవుట్లపై వేసిన కేసులు ఉపసంహరించుకునేలా చేయి అని చెప్పారు. స్వామి కరోనా సమయంలో ఇప్పటి వరకు ఎక్కడున్నావు? ఎప్పుడైనా ఏదైనా దళిత కాలనీకి వెళ్లావా అని ప్రశ్నించారు. సింగరాయకొండలో 50 మందిని వెంటేసుకొని బాలికల గురుకుల పాఠశాలల్లోకి వెళ్లడానికి సిగ్గులేదా అని నిలదీశారు. నారా లోకే్‌షపైనా తీవ్ర విమర్శలు చేశారు. సమావేశంలో వైసీపీ నాయకులు బొట్లా రామారావు, చింతపల్లి హరిబాబు, సూదనగుంట నారాయణరావు తదితరులున్నారు.
Updated Date - 2020-12-31T04:12:49+05:30 IST