ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శభాష్‌ రమణయ్య.. డాక్టర్‌ మామిళ్లపల్లికి అరుదైన అవార్డు

ABN, First Publish Date - 2020-10-27T18:10:11+05:30

కొండపి పంచాయతీ కట్టావారిపాలేనికి చెంది అమెరికాలో సీనియర్‌ సైంటిస్టుగా పని చేస్తున్న డాక్టర్‌ మామిళ్లపల్లి రమణయ్యకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గర్భస్థ వ్యాధిని సులువుగా గుర్తించడంలో నైపుణ్యం

అమెరికా సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రశంస

అక్కడి వైద్య పరిశోధన బృందానికి డాక్టర్‌ రమణయ్య నేతృత్వం


కొండపి: కొండపి పంచాయతీ కట్టావారిపాలేనికి చెంది అమెరికాలో సీనియర్‌ సైంటిస్టుగా పని చేస్తున్న డాక్టర్‌ మామిళ్లపల్లి రమణయ్యకు అరుదైన గౌరవం దక్కింది. గర్భస్థ వ్యాఽధి (ఎండోమెట్రియాసి్‌స)ను గుర్తించడంలో సులువైన పద్ధతిని కనుగొన్నందుకు ఆయనకు అమెరికా సైన్స్‌ కాంగ్రె్‌స నిర్ణాయక కమిటీ సభ్యులు ప్రశంసాపత్రం, నగదు రివార్డు ప్రకటించారు. ప్రస్తుతం రమణయ్య అమెరికాలోని కన్నెక్టికట్‌ ఏల్‌ యూనివర్సిటీలో సీనియర్‌ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. మధ్య వయస్సు మహిళల్లో గర్భస్థ వ్యాధుల (ఎండోమెట్రియాసిస్‌) గుర్తింపునకు దోహదపడే మైక్రో ఆర్‌ఎన్‌ఏను డాక్టర్‌ మామిళ్లపల్లి నేతృత్వం వహిస్తున్న ముగ్గురు సభ్యుల బృందం గుర్తించింది. ప్రస్తుతం పదేళ్ల తర్వాత శస్త్ర చికిత్స ద్వారా మాత్రమే ఎండోమెట్రియోసిస్‌ వ్యాధిని గుర్తిస్తున్నారు. కొత్త పద్ధతితో ఏడాదిలోగా బ్లడ్‌లో గుర్తించవచ్చనే విషయాన్ని కనుగొన్నారు. డాక్టర్‌ మామిళ్లపల్లి గతంలో వైద్యశాస్త్రంలో 70కి పైగా పరిశోధనలు చేశారు. ఈసందర్భంగా ఆంధ్రజ్యోతి డాక్టర్‌ మామిళ్లపల్లితో మాట్లాడారు. బయో ఫార్మా కంపెనీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి సొంత రాష్ట్రానికి సేవలు అందించాలన్న సంకల్పంతో ఉన్నానన్నారు.


Updated Date - 2020-10-27T18:10:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising