ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎంహెచ్‌వో కార్యాలయం రిమ్స్‌లోకి..

ABN, First Publish Date - 2020-12-11T05:42:53+05:30

ఒంగోలులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని సర్వజన ప్రభుత్వ వైద్యశాల(రిమ్స్‌)లోకి మార్చారు. కలెక్టరేట్‌లో ఉన్న డీఎంహెచ్‌వో కార్యాలయం ఇటీవల కురి సిన నివర్‌ తుపాను కారణంగా పూర్తిగా జలమయం కావడంతో పా టు సీలింగ్‌ కూడా పడిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 10 : ఒంగోలులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని సర్వజన ప్రభుత్వ వైద్యశాల(రిమ్స్‌)లోకి మార్చారు. కలెక్టరేట్‌లో ఉన్న డీఎంహెచ్‌వో కార్యాలయం ఇటీవల కురి సిన నివర్‌ తుపాను కారణంగా పూర్తిగా జలమయం కావడంతో పా టు సీలింగ్‌ కూడా పడిపోయింది. మరో వైపు ఆ కార్యాలయానికి ఉ న్న అన్ని సెక్షన్లు నీటి చెమ్మ కారుతుడటంతో కంప్యూటర్లు తడవకుం డా పట్టలు కూడా కట్టారు. ఈ నేపథ్యంలో ఆ కార్యాలయాన్ని పూ ర్తిగా మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఈక్రమలో సుదీర్ఘకాలంగా కలెక్టరేట్‌లో ఉన్న డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని  మార్పు చేపట్టారు. రిమ్స్‌ వైద్యశాలలోని క్యాజువాలటీ పైభాగంలో వైద్య ఆరోగ్యశాఖ కా ర్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అనుమతి ఇచ్చారు. దీంతో గత రెండు రోజుల నుంచి కలెక్టరేట్‌ నుంచి ఆ కార్యా లయానికి సంబంధించిన సామగ్రిని తరలింపు చేశారు. ఈప్రక్రియ మరో రెండు రోజులు పట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే డీఎంహెచ్‌ వో డాక్టర్‌ రత్నావళి ఛాంబర్‌తో పాటు పలు సెక్షన్లు అక్కడికి తరలి పోగా, మిగిలిన సెక్షన్లను కూడా తరలించేందుకు చర్యలు చేపట్టారు. కాగా ప్రస్తుతం కలెక్టరేట్‌లో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాల యాన్ని ఆధునికీకరణ (మరమ్మత్తులు) చేసేందుకు ఇంజనీరింగ్‌ అధి కారులు సుమారు రూ.40 లక్షలు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోం ది. అయితే ఈ ప్రక్రియ జాప్యం జరిగే అవకాశం ఉండటంతో ముం దుగా కార్యాలయాన్ని మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. 


Updated Date - 2020-12-11T05:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising