జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధుల దీపావళి శుభాకాంక్షలు
ABN, First Publish Date - 2020-11-14T04:51:11+05:30
రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఒంగోలు(కలెక్టరేట్), నవంబరు 13 : రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలు సంప్రదాయబద్ధంగా పండుగలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ఒంగోలు లోక్‌సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మరో ప్రకటనలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్థన్ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
Updated Date - 2020-11-14T04:51:11+05:30 IST