ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యాభర్తల ఆత్మహత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

ABN, First Publish Date - 2020-11-14T02:00:29+05:30

మండల పరిధిలోని యనమదలలో భార్యాభర్తల బలవన్మరణ కేసులో నిందితుణ్ణి అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై వై.వి.చౌదరి చెప్పారు.

అరెస్ట్‌ చేసిన నిందితునితో ఎస్సై వై.వి.చౌదరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


యద్దనపూడి, నవంబర్‌ 13 : మండల పరిధిలోని యనమదలలో భార్యాభర్తల బలవన్మరణ కేసులో నిందితున్ని అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై వై.వి.చౌదరి చెప్పారు. యనమదలకు చెందిన ఓ యువతి నరసరావుపేటలో ఇంజినీరింగ్‌ చదువుతోంది. అక్కడ గురజాలకు చెందిన మణికంఠ అనే యువకుడు ఆ యువతిని ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకోవాలని కోరగా ఆమె తిరస్కరించింది. వెంటనే ఆ యువకుడు యనమదలకు వచ్చి యువతి తల్లిదండ్రుల వద్ద వివాహ ప్రస్తావన తెచ్చాడు. వారూ తిరస్కరించారు. ఆ యువకుడు మరోమారు అలా ప్రయత్నించినా ఆ యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కుమార్తె వివాహంపై గ్రామంలో చర్చించుకుంటుండగా తమ పరువు పోయిందన్న ఆవేదనతో యువతి తల్లిదండ్రులు ముప్పరాజు హనుమంతరావు, నాగరాజలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితున్ని శుక్రవారం యనమదల ఆంజనేయస్వామి గుడి వద్ద అరెస్ట్‌ చేసి పర్చూరు కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్సై చెప్పారు.


Updated Date - 2020-11-14T02:00:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising