ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విస్తరించిన వైరస్‌.. మంత్రి బాలినేనికి కరోనా.. అపోలోలో చేరిక

ABN, First Publish Date - 2020-08-05T18:10:27+05:30

ప్రకాశం జిల్లాలో కరోనా అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. సాధారణ ప్రజలతో పాటు వ్యాపార, రాజకీయ, ఉద్యోగ రంగాల్లోని ప్రముఖులు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే రాంబాబు దంపతులకు ఒంగోలులో వైద్యం

హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బలరాం 

మరో 383 పాజిటివ్‌లు నమోదు.. నలుగురి మృతి 


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలో కరోనా అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. సాధారణ  ప్రజలతో పాటు వ్యాపార, రాజకీయ, ఉద్యోగ రంగాల్లోని ప్రముఖులు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యేల్లో కరణం బలరా మకృష్ణమూర్తి, అన్నా రాంబాబులతోపాటు వారి కుటుంబాల్లోని పలువురు కొవిడ్‌ బారినపడ్డారు. జిల్లాలో మంగళవారం 383 కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. 67మంది కోలు కుని వైద్యశాల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఏరోజుకారోజు  పాజిటివ్‌ వచ్చిన వారందరికీ వైద్యశాలలో పడకలను కేటాయించలేకపోతున్నారు. ఫలితంగా అవసరమైన సమయంలో చికిత్స అందక కొందరు మృతిచెందుతున్నారు. 


వైద్యశాలలో చేరిన బాలినేని 

మంత్రి బాలినేని మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని అపోలో వైద్యశాలలో చేరారు. నాలుగైదు రోజుల నుంచి ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. తొలుత రెండుసార్లు పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్‌ అని వచ్చింది. మంగళవారం మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజి టివ్‌ అని నిర్ధారణ అయ్యింది. వెంటనే ఆయన అపోలోలో చేరారు. ముఖ్యమంత్రి కార్యా లయానికీ సమాచారం ఇచ్చారు. సీఎం ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అయితే బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవుల నియామకానికి సంబంధించి జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో బుధవారం విజయవాడలో జరగాల్సిన సమావేశాన్ని పా ర్టీ ఇన్‌చార్జ్‌ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి నిర్వహి స్తారా లేక వాయిదా వేస్తారా అనే విషయం తెలియరాలేదు. కరోనా పాజిటివ్‌ వచ్చిన గిద్ద లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఆయన సతీమణి ఒంగోలులోని సంఘమిత్ర వైద్యశా లలోనే చికిత్స పొందుతున్నారు. చీరాల ఎమ్మె ల్యే బలరాం హైదరాబాద్‌లోని స్టార్‌ వైద్యశా లలో చికిత్సపొందుతుండగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన కుమారుడు వెంకటేష్‌కి పాజిటివ్‌ రాగా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. బల రాం సతీమణికి కూడా వైద్యశాలలో పరీక్షలు నిర్వహించి చికిత్సలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాజిటివ్‌ వచ్చిన నేతల వ్యక్తిగత సి బ్బంది, అనుచరులలో కూడా ఎక్కువ మంది కరోనా బాధితులుగా మారిపోయారు.  

Updated Date - 2020-08-05T18:10:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising