ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సడలింపు వేళ రద్దీ

ABN, First Publish Date - 2020-05-25T11:10:18+05:30

జిల్లావ్యాప్తంగా 61వ రోజైన ఆదివారం కూడా లాక్‌డౌన్‌ కొనసాగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతంత మాత్రంగానే నియంత్రణ

ఒంగోలులో నిర్లక్ష్యంగా యంత్రాంగం

జిల్లా అంతటా కొనసాగిన లాక్‌డౌన్‌


ఒంగోలు, మే 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా 61వ రోజైన ఆదివారం కూడా లాక్‌డౌన్‌ కొనసాగింది. సడలింపు సమయంలో ప్రధాన పట్టణాల్లో అధిక రద్దీ నెలకొంది. అధికారుల నియంత్రణ ఎక్కడా కన్పించలేదు. అధికంగా పాజిటివ్‌ కేసులున్న ఒంగోలు వంటి ప్రాంతంలోనూ  మాస్కులు లేకుండా ప్రజలు తిరుగున్నా, భౌతిక దూరం పాటించకపోయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లా కేంద్రంలో పోలీసు యంత్రాంగంతో సమాన బాధ్యత ఉన్న కార్పొరేషన్‌ అధికారులు లాక్‌డౌన్‌ ఆంక్షల విషయంలో తీవ్ర ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.


రద్దీ నివారణ, భౌతికదూరం పాటింపు కోసం ఆదివారం మాంసం దుకాణాలను నిలిపివేసినట్లు ప్రకటించి మిన్నకుండటం మినహా జనావాసాల మధ్య జరుగుతున్న అమ్మకాల గురించి కార్పొరేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. పారిశుధ్యం విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.  ఇలాంటి పరిస్థితి మరికొన్నిచోట్ల కూడా కనిపిస్తోంది. 

Updated Date - 2020-05-25T11:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising