ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను అమలు చేయాలి

ABN, First Publish Date - 2020-05-24T09:14:38+05:30

జిల్లాలోనాఆల్గవ విడత లాక్‌డౌన్‌కు సంబంధించి జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశం


ఒంగోలు(కలెక్టరేట్‌), మే 23: జిల్లాలోనాఆల్గవ విడత లాక్‌డౌన్‌కు సంబంధించి జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ మినహాయింపులు ఏమీలేవని స్పష్టం చేశారు. నాన్‌ కంటైన్మెంట్‌ జోన్లలో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించడం, భౌతికదూరం పాటించడం, పనిచేసే స్థలంలో శానిటైజషన్‌ ప్రొటోకాల్‌ అనుసరించాలని చెప్పారు. నాన్‌ కంటైన్మెంట్‌ జోన్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిత్యవసరాల షాపులను తెరవచ్చని తెలిపారు. జిల్లాలో సినిమాహాల్స్‌, షాపింగ్‌మాల్స్‌, దేవాలయాలు తెరవడం నిషేధమన్నారు. ఈనెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. వలస కార్మికులకు జాబ్‌ కార్డులు ఇచ్చి పనులు కల్పించాలని చెప్పారు.


ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం తహసీల్దార్లు, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. అపరాధ రుసుం వసూలుకు సంబంధించి తగిన రశీదు ఇచ్చి సదరు వ్యక్తి నుంచి అకనాలెడ్జిమెంట్‌ పొందాలన్నారు. ఈ కాన్పరెన్స్‌లో జేసీ-1 వెంకట మురళీ, జేసీ-2 చేతన్‌, జేసీ-3 నరేంద్రప్రసాద్‌, డీఆర్వో వెంకటసుబ్బయ్య, స్పెషల్‌ కలెక్టర్‌ గంగాధర్‌గౌడ్‌, ఓఎ్‌సడీ చౌడేశ్వరి, వివిధ శాఖల అధికారులు కైలా్‌షగిరీశ్వర్‌, జీవీ.నారాయణరెడ్డి, వీఎ్‌స.సుబ్బారావు, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 


రేపటి నుంచి నవరత్నాలపై ప్రచారం

ఒంగోలు(కలెక్టరేట్‌) : జిల్లాలో నవరత్నాల అమలు, పురోగతిపై సోమవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నవరత్నాల పథకాలపై సీఎం జగన్మోహన్‌రెడ్డికి  వివరించేందుకు కనీసం మూడు నుంచి ఐదుగురు లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. పర్యవేక్షణ కోసం ఇద్దరు జేసీలను నియమించినట్లు తెలిపారు. 

Updated Date - 2020-05-24T09:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising