ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాటతప్పి ప్రజల్ని వంచించిన సీఎం జగన్‌

ABN, First Publish Date - 2020-08-07T11:27:26+05:30

న్నికలకు ముందు అమరావతే రాజధాని అని, అందుకు తాము అన్ని విధాలా మద్దతిస్తామని అసెంబ్లీలోనే చెప్పి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి, ఆగస్టు 6 : ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని, అందుకు తాము అన్ని విధాలా మద్దతిస్తామని అసెంబ్లీలోనే చెప్పి అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ మాట తప్పి ప్రజలను వంచించారని టీడీపీ నాయకులు నారపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, కో ఆప్షన్‌ బుజ్జి విమర్శించారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో గురువారం జరిగిన  సమావేశంలో వారు మాట్లాడారు. మూడు రాజధానుల అంశం ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ అంశం ఎన్నికల ముందు దాచిపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచాక నమ్మకద్రోహం చేసి రాజధాని రైతులకు వెన్నుపోటు పొడిచారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ పదవులను కూడా త్యాగం చేస్తామని సవాలు విసిరినా సమాధానం చెప్పే ధైర్యం సీఎంకు లేదని దెప్పిపొడిచారు.  సమావేశంలో నాయకులు తమ్మినేని వెంకటరెడ్డి, షేక్‌ జంషీర్‌, బ్రహ్మంగౌడ్‌, సురేష్‌, జనార్దన్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-07T11:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising