ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడేళ్ల చిన్నారిని ఇంటిపైకి తీసుకెళ్లి.. అసభ్యంగా ప్రవర్తించాడని తెలియడంతో..

ABN, First Publish Date - 2020-12-07T17:27:17+05:30

అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం

యువకుడికి దేహశుద్ధి

పోలీసులకు అప్పగింత


చీమకుర్తి(ప్రకాశం): అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై పట్టణానికి చెందిన యువకుడు అత్యాచారానికి యత్నించిన ఘటన చీమకుర్తిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణానికి చెందిన గొల్లపూడి శ్రీను అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. బీహర్‌ రాష్ట్రం నుంచి ఒక వలస కుటుంబం చీమకుర్తిలో గ్రానైట్‌ క్వారీలో పనిచేస్తోంది. శ్రీను అనే దివ్యాంగ యువకుడు ఈ నెల 3న బాధిత కుటుంబం నివసించే ఇంటి వద్దకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు చూడకుండా బాలికను మభ్యపెట్టి నిర్జనంగా ఉండే అదే గృహం పై అంతస్తుకు తీసుకువెళ్లాడు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారానికి యత్నించాడు. ఎదురు గృహంలో ఉంటున్న వ్యక్తి గమనించి కేకలు వేయడంతో శ్రీను బాలికను వదిలి అక్కడ నుంచి ఉడాయించాడు. 


ఆదివారం ఉదయం శ్రీను బస్టాండ్‌ సెంటర్‌లో ఉండడం గమనించిన ఆ వ్యక్తి బాలిక కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీంతో అప్పటికే ఘటన గురించి తెలిసి నిందితుడి కోసం వెదుకుతున్న కుటుంబ సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అక్కడే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై నాగశివారెడ్డి తెలిపారు.


Updated Date - 2020-12-07T17:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising