ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాగులో కొట్టుకుపోయి విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2020-09-27T17:57:11+05:30

వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును తిలకించేందుకు వెళ్లిన ముగ్గురు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరు సురక్షితం

అంబడిపూడి బీసీ కాలనీలో విషాదఛాయలు 


బల్లికురవ(ప్రకాశం): వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును తిలకించేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో కొట్టుకుపోగా వారిలో ఒకరు మృతిచెందారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన బల్లికురవ మండలంలోని అంబడిపూడి గ్రామంలో శనివారం జరిగింది. బల్లి కురవ మండలం అంబడిపూడి గ్రామానికి చెందిన విద్యార్థులు  పల్లపు శ్రావణ్‌కుమార్‌, గుంజి విశాల్‌, గుంజి విజయ్‌పాల్‌ కలిసి సమీపంలో ఉన్న చెరువు అలుగు వాగు వద్దకు వెళ్లారు. నీటిలో నుంచి రోడ్డు ఆవలి వైపుకి వెళ్లేందుకు ముగ్గురూ చేతులు పట్టు కొని దిగారు. వారిలో విజయ్‌పాల్‌ భయపడి బయ టకు పరుగులు తీశాడు. మిగిలిన ఇరువురు ముం దుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వాగు నీటి ఉధృతికి నీటిలో జారిపోయారు.  స్థానికులు విశాల్‌ను బ యటకు లాగారు. 


శ్రావణ్‌కుమార్‌ (7ఏళ్లు)  నీటిలో కొట్టుకుపోయాడు. వెంటనే స్థానికులు నీటిలో వి ద్యార్థి కోసం వెతకగా చెట్ల మధ్యలో ఉన్న మృత దేహాన్ని బయటకు తీశారు. విద్యార్థి మృతితో అంబ డిపూడి బీసీ కాలనీలో  విషాదఛాయలు ఆలుము కొన్నాయి. ఒక్కగానొక్క కుమారుడు మృతితో విద్యా ర్థి తల్లిదండ్రుల రోదన చూపరులను కంటతడిపెట్టించింది. ఎస్సె ఎం.శివనాంచారయ్య ఘటనా ప్రాంతాన్ని  పరిశీలించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-09-27T17:57:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising