ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.10కోట్లతో పట్టణాభివృద్ధి పనులు

ABN, First Publish Date - 2020-08-07T11:27:53+05:30

అద్దంకి పట్టణాభివృద్ధికి రూ.10కోట్ల నిధులు మంజూరు చేయించి, పనులు చేపడుతున్నామని నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బాచిన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాచిన కృష్ణచైతన్య


అద్దంకి, ఆగస్టు 6 : అద్దంకి పట్టణాభివృద్ధికి రూ.10కోట్ల నిధులు మంజూరు చేయించి, పనులు చేపడుతున్నామని నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య చెప్పారు. పట్టణంలోని కాకానిపాలెం, ఎల్‌ఈఎ్‌ఫనగర్‌లో గురువారం సీసీ రోడ్లు, ఎన్‌ఎ్‌సపీ కాలనీలో పలు చోట్ల నిర్మించిన కల్వర్టులను కృష్ణచైతన్య ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభించారు. 10 సచివాలయాలకు మంజూరైన కంప్యూటర్లను ఆయన అందజేశారు.


నామ్‌, దర్శి, రేణింగవరం రోడ్డలలో సెంట్రల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తామని, అన్ని వార్డులలో జిమ్‌లు ఏర్పాటు చేస్తామని కృష్ణచైతన్య చెప్పారు. కార్యక్రమంలో నగరపంచాయతీ కమిషనర్‌ ఫజులుల్లా, తహసీల్దార్‌ సీతారామయ్య, మాజీ ఎంపీపీ జ్యోతి హనుమంతరావు, దామా హనుమంతరావు, కొండారెడ్డి, కనమర్లపూడి శ్రీను, యర్రా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చక్రాయపాలెంలో దశాబ్దాలుగా ఎస్సీలు సాగు చేసుకుంటున్న భూములను కొందరు వక్రమార్గంలో అన్యాక్రాంతం చేసేందుకు చూస్తున్నారని బాధితులు బాచిన కృష్ణచైతన్యకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2020-08-07T11:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising