బాపూజీ కాంప్లెక్స్ అభివృద్ధికి కృషి
ABN, First Publish Date - 2020-11-13T06:15:44+05:30
ఒంగోలు లోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్‌లోని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రా ష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
ఒంగోలు(కలెక్టరేట్), నవంబరు 12 : ఒంగోలు లోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్‌లోని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రా ష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక కాంప్లెక్స్‌లో క మిటీ నూతన ప్రధాన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో బాలినేని మాట్లాడుతూ కొవిడ్ వి పత్కర పరిస్థితుల్లో కాంప్లెక్స్ ద్వారా ప్రజలకు అ వసరమైన నిత్యవసరాలను అందించడం అభినం దనీయమన్నారు. అంతకు ముందు కాంప్లెక్స్ క మిటీ అధ్యక్షుడు కోడూరి సత్యనారాయణ, ప్రధా నకార్యదర్శి ఎస్‌ఆర్‌ఎంఎన్.శ్రీనివాసరావుల ఆధ్వ ర్యంలో మంత్రి బాలినేనికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేష న్ చైర్మన్ కుప్పం ప్రసాద్, సూపర్‌బజారు చైర్మ న్ వేమూరి సూర్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు, వైసీపీ నగర అ ధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, కఠారి శంకర్, గంగాడ సుజాత, కాంప్లెక్స్ కమిటీ ప్రతినిధులు పి.ప్రభాకరరావు, వి.సత్యశ్రీనివాసులు, ఎం.శ్రీనివా సరావు, బియ్యపు వరదరాజం, కె.ప్రకాష్, కూర పాటి సత్యనారాయణ, ఎం.వెంకటకృష్ణారావు, ప బ్బిశెట్టి శ్రీనివాసరావు, కె.రాఘవయ్య, జేసీ.వెంకటే శ్వర్లు, మిరియాల కృష్ణమూర్తి పాల్గొన్నారు. అ నంతరం మంత్రి బాలినేని 60 అడుగులరోడ్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ సంజీవిని మె డికల్‌షాపు బ్రాంచిని ప్రారంభించారు. మంత్రికి మెడికల్ షాపు సీనియర్ ఫార్మాసిస్టు రంగప్రసా ద్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
మంత్రి బాలినేనికి అల్పాహార విందు
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం స్థా నిక మంగమూరురోడ్డులోని మాజీమంత్రి శిద్దా రాఘవరావు నివాసానికి వెళ్ళారు. ఈ సందర్భం గా మంత్రి బాలినేనికి శిద్దా రాఘవరావుతో పా టు కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అల్పాహర విందు చేశారు. అనంత రం బాలినేనిని ఘనంగా సత్కరించారు. కార్యక్ర మంలో యువపారిశ్రామికవేత్త శిద్దా సుధీర్‌కు మార్, పారిశ్రామికవేత్తలు శిద్దా హనుమంతరా వు, శిద్దా సూర్యప్రకాశరావు, వైసీపీ నగర అధ్య క్షుడు సింగరాజు వెంకట్రావు, బీసీసెల్ విభాగం అధ్యక్షుడు కఠారి శంకర్ పాల్గొన్నారు.
Updated Date - 2020-11-13T06:15:44+05:30 IST