ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎంపీలకు వ్యాధులపై అవగాహన

ABN, First Publish Date - 2020-03-16T11:20:12+05:30

వివిధ వ్యాధులపై పీఎంపీలు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటే ప్రజలకు వాటి నుంచి రక్షణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం(వన్‌టౌన్‌), మార్చి 15: వివిధ వ్యాధులపై పీఎంపీలు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటే ప్రజలకు వాటి నుంచి రక్షణ కల్పించడంలో తోడ్పడవచ్చు అని గుంటూరు బాలాజి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ వైద్యుడు డాక్టర్‌ వీ.చంద్రశేఖర్‌ అన్నారు. పీఎంపీల అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాఽ ద్యక్షులు అల్‌హజ్‌ షేక్‌ మౌలాలి ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్‌క్లబ్‌లో పీఎంపీలకు అవగాహన కార్యక్రమం శిక్షణా నిర్వహించారు. ఈ సంద ర్భంగా డాక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మన దేశంలో కూడా వ్యాపిస్తోందన్నారు.


డాక్టర్‌ కొర్నేలియస్‌ జొన్నకూటి కిడ్ని మూత్రకోశ వ్యాధులు లక్షణాలు వివరించారు. ఆర్థోపెడిషియన్‌ డాక్టర్‌ కాశీవిశ్వనాథ్‌ ఎముకలు అరుగుదల తీసుకోవలసిన జాగ్ర త్తలు తెలిపారు. డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ కె. శంకర్‌రెడ్డి మధుమేహవ్యాధిపై అవగాహన కల్పించారు. డాక్టర్‌ శ్యామ్‌ వివేక్‌, డాక్టర్‌ మగ్భూల్‌ బాషాలు మాట్లాడుతూ పీఎంపీల సేవలు గ్రామీణ ప్రాంతాలలో ఎంతో ఉప యోగకరంగా ఉన్నాయని ప్రథమ చికిత్స మాత్రమే చేసి పెద్ద వ్యాధులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అర్హులైన డాక్టర్ల వద్ద వెళ్లేలా చూడాలన్నారు.


తెలిసి తెలియని వైద్యం చేయడం నేరం అన్నారు. పీఎంపీల రాష్ట్ర ఉపాఽధ్యక్షులు అల్‌ హజ్‌ షేక్‌ మౌలాలి మాట్లాడుతూ పీఎంపీ అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నా మని ఇటువంటి కార్యక్రమాల ద్వారా పీఎం పీలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం పీఎంపీల సేవలు గుర్తించి వారికి అవసరమైన మరింత శిక్షణనిచ్చి వారి ఆర్థిక అభివృద్ధిలో తోడ్పాడలన్నారు. అనంతరం పీఎంపీలకు సీఎంఏ సర్టిఫికేట్‌లు అందజే శారు. 

Updated Date - 2020-03-16T11:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising