ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం దుకాణాలపై దాడులు

ABN, First Publish Date - 2020-03-02T10:50:30+05:30

చీరాల పట్టణంలోని మద్యం దుకాణాలపై ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. అధిక ధరలకు మద్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీరాల టౌన్‌, మార్చి 1 : చీరాల పట్టణంలోని మద్యం దుకాణాలపై ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదు లకు స్పందించి వారు దాడులు నిర్వహిం చారు. సీఐలు ఎన్‌.తిరుపతయ్య, ఎ.లీనా ఈ విషయాన్ని తెలియజేశారు.ఒంగోలు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అసిస్టెంట్‌  కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆదివారం మూడు బృందాలు ఏర్పడి చీరాలలో దాడులు నిర్వహించారు.


కృష్ణవైన్స్‌ లో  అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్టు గుర్తించిన అధికారులు ముగ్గురు సేల్స్‌మెన్‌ లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద ర్భంగా  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మాట్లాడుతూ ఖరీదు గల మద్యం సీసాలను గుట్టు చప్పుడు కాకుండా సుపరిచితులకు అధిక ధరలకు విక్రయించి నాసిరకం మందు ను కౌంటర్‌లో విక్రయిస్తున్నట్టు నిందితులు ఒప్పుకున్నారని వారు  వివరించారు. అలాగే రోజు వారీ సేల్స్‌ రికార్డులను పరిశీలించగా,  రూ.39వేలు అపహరణకు గురైనట్టు పేర్కొ న్నారు. వేటపాలెం మండల చల్లారెడ్డి పాలెం లో మద్యం దుకాణాన్ని కూడా పరిశీలించి నట్టు అధికారులు తెలిపారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్‌ఐలు రమేష్‌, సత్యనారా యణ, కానిస్టేబుళ్లు రమణారెడ్డి, ప్రసాద్‌, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు  పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T10:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising