కదంతొక్కిన ఆశా వర్కర్లు
ABN, First Publish Date - 2020-11-03T17:06:36+05:30
ఆశా కార్యకర్తలు కదం తొక్కారు. తమను సచివాలయాలకు..
కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా
‘సచివాలయాలకు అప్పగింత’పై ఆగ్రహం
ఉపసంహరించుకోవాలని డిమాండ్
లోపలికి దూసుకెళ్లిన కార్యకర్తలు
అడ్డుకున్న పోలీసులు
తోపులాట.. రెండు గంటలపాటు ఉద్రిక్తత
ఒంగోలు: ఆశా కార్యకర్తలు కదం తొక్కారు. తమను సచివాలయాలకు అప్పగించాలన్న నిర్ణయంపై కన్నెర్ర చేశారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డి మాండ్ చేస్తూ ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. జిల్లా నలుమూలల నుంచి వం దలాది మంది ఆశా వర్కర్లు తరలివచ్చి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక సందర్భంలో కొందరు కార్యకర్తలు ప్రకాశం భవన్‌లోకి దూసుకెళ్లారు. వారిని లోప ల ఉన్న ప్రధాన ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వివాదం, తోపులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడే బైటాయించిన కార్యకర్తలు ప్రభుత్వ తీరు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఆర్వో వినాయకం అక్కడికి చేరుకొని కార్యకర్తలకు హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ధర్నానుద్దేశించి సీఐటీయు జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు మాట్లాడుతూ ఆశా వర్కర్లను సచివాలయాలకు అప్పగించే విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్‌హెచ్‌ఎం నిబంధనలకు విరుద్ధంగా రూ. 2500 నుంచి 8వేల జనాభాకు ఒక ఆశాను అప్పజెప్పడం, స్థానిక జనాభా పరిఽధిలో కేటాయించకపోవడం దారుణంగా ఉందన్నారు. ఈ విధానాలను ఉపసంహరించుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి. కల్పన మాట్లాడుతూ ప్రభుత్వం ఆశావర్కర్లకు రూ. 10వేలు గౌరవ వేతనం ఇస్తూ రికార్డుల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతున్నదన్నారు. వెంటనే ప్రభుత్వం తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ, ఐద్వా, సీఐటీయూ, ఆశా వర్కర్ల యూనియన్ల ప్రతినిధులు అయ్యపరెడ్డి, మున్వర్ సుల్తానా, ఆదిలక్ష్మి, రమాదేవి, మహేష్, సిహెచ్. రమాదేవి, శ్రీకాంత్, శ్రీరా మ శ్రీనివాసులు, రాఘవమ్మ, ఎస్తేరు, విజయ, రజని, అమ్మాజీ, సుశీల, వీరమ్మ పాల్గొన్నారు.
Updated Date - 2020-11-03T17:06:36+05:30 IST