ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారీల్లో ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్‌లు

ABN, First Publish Date - 2020-08-12T11:28:43+05:30

రామతీర్థం పరిసర ప్రాంతాల్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గెలాక్సీ గ్రానైట్‌ గనుల్లో ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీమకుర్తి, ఆగస్టు 11 : రామతీర్థం పరిసర ప్రాంతాల్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గెలాక్సీ గ్రానైట్‌ గనుల్లో ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రధానంగా క్వారీల తవ్వకం రామతీర్థం పరసరాల్లోని ఆర్‌ఎల్‌పురం గ్రామ సమీపం వరకు వెళ్లింది. గనుల్లో బ్లాస్టింగ్‌ ప్రక్రియ నిత్యం జరుగుతోంది. అయితే నిర్ధిష్ట సమయంలో రక్షణ చర్యలు చేపట్టి, నిబంధనల మేరకు బ్లాస్టింగ్‌ చేయాల్సి ఉంది. కానీ ఉత్పత్తే లక్ష్యంగా భద్రతకు తిలోదకాలు ఇస్తుండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.


గత నెలలో రామతీర్థం గుడి సమీపంలో ఉన్న క్వారీలో బ్లాస్టింగ్‌ సమయంలో రాయి ఎగిరిపడి అక్కడి కాలనీలో ఉంటున్న మహిళ మృతి చెందింది. అయినా క్వారీల యజమానుల వైఖరిలో మార్పు రావటం లేదు. ఆర్‌ఎల్‌పురం శివారు వెంకటేశ్వరకాలనీకి సమీపంలో కొత్తగా విస్తరిస్తున్న క్వారీలో మంగళవారం బ్లాస్టింగ్‌ చేశారు. అయితే నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ప్రక్రియ చేపట్టడం సమీప కాలనీవాసుల్లో ఆందోళన నింపింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్వారీల్లో బ్లాస్టింగ్‌ ప్రక్రియను నిబంధనల మేరకు జరిగేలా చర్యలు తీసుకోవాలని సమీప ప్రాంతవాసులు కోరుతున్నారు.

Updated Date - 2020-08-12T11:28:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising