అమరావతినే కొనసాగించాలి
ABN, First Publish Date - 2020-12-02T05:24:26+05:30
రాష్ట్ర రాజధాని అమరావతిలోనే కొ నసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు డి మాండ్ చేశారు. ఈనెల 16వ తేదీకి రైతుల ఉద్యమం ఏడాది పూర్తవు తున్నందున నేపథ్యంలో భారీ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించా రు.
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 1 : రాష్ట్ర రాజధాని అమరావతిలోనే కొ నసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు డి మాండ్ చేశారు. ఈనెల 16వ తేదీకి రైతుల ఉద్యమం ఏడాది పూర్తవు తున్నందున నేపథ్యంలో భారీ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించా రు. ఈ సందర్భంగా మంగళవారం ఒంగోలులోని సీపీఐ కార్యాలయంలో జేఏసీ సభ్యుడు ఉప్పుటూరి ప్రకాశరావు అధ్యక్షత సంఘీభావ సమావేశం జరిగింది. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవా లని, సీఆర్‌డీఏ చట్టాన్ని పునరుద్ధరించాలని, అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, రైతుకూలీ, వృత్తిదారులు, మహిళా తదితర సంఘాలు ఐక్యం గా అమరావతి రైతు ఉద్యమానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించా లని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో వివిధ రాజకీయ, సం ఘాల నాయకులు చుంచు శేషయ్య, వల్లంరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కామేపల్లి శ్రీనివాసరావు, గుర్రాల రాజ్‌విమల్, కె.వెంకయ్య, నార్నె వెంకటసుబ్బయ్య, కామరాజుగడ్డ కుసుమకుమారి, అజీమున్నీసా బేగం, జి.నరసింహరావు, కె. శ్రీనివాసరావు, కటారి నాగేశ్వరరావు, పాతూరి పుల్లయ్యచౌదరి, పెళ్ళూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-02T05:24:26+05:30 IST