ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరుగురు కరోనా అనుమానితులకు నెగెటివ్‌

ABN, First Publish Date - 2020-03-27T10:32:04+05:30

రిమ్స్‌లో ప్రస్తుతం మొత్తం 13 మంది కరోనా వైరస్‌ అనుమానితులు ఉండగా వీరిలో ఆరుగురికి వైరస్‌ లేదని తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఊపిరిపీల్చుకున్న రిమ్స్‌ వైద్యులు

ఐసోలేషన్‌ వార్డు నుంచి డిశ్చార్చి  


ఒంగోలు నగరం, మార్చి 26: రిమ్స్‌లో ప్రస్తుతం మొత్తం 13 మంది కరోనా వైరస్‌ అనుమానితులు ఉండగా వీరిలో ఆరుగురికి వైరస్‌ లేదని తేలింది. వీరికి సంబంధించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్‌ ఫలితాలు వచ్చాయి. దీంతో రిమ్స్‌ అధికారుల ఊపిరి పీల్చుకున్నారు. వీరిలో దర్శికి చెందిన యువకుడు, ఇటలీనుంచి వచ్చిన ఒంగోలు యువకుడు, పూణే నుంచి వచ్చిన మరో యువకుడికి, రైల్వే డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉద్యోగికి, చీమకుర్తి మండలం నాయుడుపాలెంకు చెందిన వ్యక్తి, జార్ఖండ్‌కు చెందిన మరోవ్యక్తికి కరోనా లేదని నిర్ధారణ అయ్యింది.


దీంతోవీరిని రిమ్స్‌ అధికారులు గురువారం రాత్రి డిశ్చార్చి చేశారు. జిల్లాలో అనుమానిత కేసులు పెరుగుతున్నాయో గాని పాజిటివ్‌ కేసులు నమోదు కా వటం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీరాములు, ఆర్‌ఎంవో డాక్టర్‌ వేణుగోపాలరెడ్డి ప్రజలను కోరారు. ఇప్పటి వరకు ఒంగోలు జడ్పీ కాలనీకి చెందిన యువకుడికే కరోనా నిర్దారణ జరిగిందని వివరించారు. అలాగే చీరాల నవాబుపేటకు చెందిన భార్యాభర్తలకు కరోనా లక్షణాల అనుమానం నేపథ్యంలో రిమ్స్‌కు తరలించారు.

Updated Date - 2020-03-27T10:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising