ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలింతలకు మాయమాటలు చెప్పి.. శిశువుతో జంప్.. కానీ..

ABN, First Publish Date - 2020-10-01T11:06:52+05:30

బాలింతలకు మాయమాటలు చెప్పింది. తాను ఏఎన్‌ఎంనని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఎన్‌ఎంనంటూ నమ్మబలికి శిశువు కిడ్నాప్‌ 

రెండు గంటల్లో ఛేదించిన పోలీసులు 

అదుపులో నిందితురాలు 


దర్శి, సెప్టెంబరు 30 : బాలింతలకు మాయమాటలు చెప్పింది. తాను ఏఎన్‌ఎంనని పరిచయం చేసుకుంది. మీ ఖాతాల్లో ప్రభుత్వ పథకానికి సంబంధించిన డబ్బులు జమ కాలేదని, తనతో వస్తే వెంటనే వేయిస్తానని నమ్మబలికింది. వారిలో ఓ బాలింత వద్ద ఉన్న శిశువును తీసుకొని ఫొటో తీయించుకు రమ్మని ఆమెను స్టూడియోలోకి పంపింది. ఆ తర్వాత శిశువుతో సహా ఉడాయించింది. వేగంగా స్పందించిన పోలీసులు రెండు గంటల్లో నిందితురాలిని పట్టుకున్నారు. తల్లిచెంతకు బిడ్డను చేర్చారు.


దొనకొండ మండలం పోలేపల్లి ఎస్సీ కాలనీకి బుధవారం ఒక మహిళ వచ్చింది.  అక్కడ అంగన్‌వాడీ కార్యకర్తను కలిసి తనను తాను ఏఎన్‌ఎంగా పరిచయం చేసుకొంది. చిన్న పిల్లల తల్లులకు ప్రభుత్వం బ్యాంకులో రూ. 20వేలు వేస్తున్నదని చెప్పింది. కాలనీలోని పలువురు బాలింతలకు డబ్బులు పడలేదని, వారిని తమతో పంపిస్తే రికార్డుల్లో నమోదు చేయించి డబ్బులు వచ్చేలా చేస్తానని నమ్మించింది. దీంతో నలుగురు చిన్న పిల్లల తల్లులు ఆమెతోపాటు దర్శికి చేరుకున్నారు. వారిలో ముగ్గురు తల్లులతోపాటు వారి భర్తలు కూడా వెంట వచ్చారు. భర్తలున్న మహిళలను కురిచేడు రోడ్డులో ఒక స్టూడియో వద్ద దించింది.


వారిని అక్కడ ఫొటోలు దిగమని చెప్పింది. ఒంటరిగా వచ్చిన మహిళను అద్దంకి రోడ్డులోని స్టూడియో వద్దకు తీసుకెళ్లింది. పాపను తాను ఎత్తుకుంటానని ఫొటో దిగమని ఆమెను చెప్పి లోపలికి పంపింది. ఆమె తిరిగి వచ్చే లోపు నెల పాపతో మహిళ మాయమైంది. ఎంత వెతుకులాడినా అచూకీ దొరక్కపోవడంతో వెంటనే బాధితురాలు దర్శి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై రామకోటయ్య ఆధ్వర్యంలో పోలీసులు అన్ని ప్రాంతాల్లో గాలించారు. నూజెండ్ల మీదుగా వినుకొండ వైపు ఆటోలో పాపను తీసుకువెళ్తున్న మహిళను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం తల్లిచెంతకు శిశువును చేర్చారు. 


అపహరణకు గురైన శిశువును రెండు గంటల్లో పట్టుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో ముండ్లమూరు మండలం రెడ్డినగర్‌కు చెందిన ఏడాదిన్నర వయసున్న ఆరు్‌షరెడ్డి అదృశ్యమైన విషయం తెలిసిందే పోలీసులు ఎంతో తీవ్రంగా గాలించినప్పటికీ ఇప్పటి వరకు ఆ బాలుడి లభించలేదు. ప్రస్తుతం పోలీసులకు పట్టుబడిన మహిళది కూడా దర్శి. దీంతో పోలీసులు ఆవైపు కూడా దృష్టి సారించారు. 

Updated Date - 2020-10-01T11:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising