ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.2 లక్షల లంచం డిమాండ్‌ చేస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు..!

ABN, First Publish Date - 2020-07-10T20:28:41+05:30

భూగర్భ గనుల శాఖలో అవినీతిని అరికట్టేందు కు ఏర్పాటు చేసిన విజిలెన్స్‌ స్క్వాడ్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్‌ జియాలజిస్టు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికార్లకు దొరికాడు. ఒంగోలు కేంద్రంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీబీ దాడితో కలకలం

అసిస్టెంట్‌ జియాలిజిస్టు రూ.2 లక్షల లంచం డిమాండ్‌

విజిలెన్స్‌ స్వ్వాడ్‌లో పనిచేస్తూ అరెస్ట్‌ కావడం చర్చనీయాంశం


ఒంగోలు(క్రైం): భూగర్భ గనుల శాఖలో అవినీతిని అరికట్టేందు కు ఏర్పాటు చేసిన విజిలెన్స్‌ స్క్వాడ్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్‌ జియాలజిస్టు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికార్లకు దొరికాడు. ఒంగోలు కేంద్రంగా పనిచేసే భూగర్భ గనుల శాఖ రీజనల్‌ విజిలెన్స్‌ స్క్వాడ్‌లో అసిస్టెం ట్‌ జియాలజిస్టుగా పనిచేస్తున్న కె.వీరాస్వామి ఓ రైతు వద్ద రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ గుంటూరులో గురువారం పట్టుబడ్డాడు. వివరాల్లోకెళ్తే... గుంటూరు జిల్లా కొల్లిపర మండలం బొమ్మువానిపాలెంలో భట్టు విజయసాగర్‌కు 4.66 ఎకరాల భూమి ఉంది. 


దాంట్లో ఇసుక తవ్వకాలకు భూగర్భ గనుల శాఖ రిజనల్‌ స్క్వాడ్‌ అనుమతి ఇవ్వాల్సి ఉంది. అందుకు అసిస్టెంట్‌ జియాలజిస్టు వీరాస్వామి రూ.2 లక్షలు డిమాండ్‌ చేశాడు. విజయసాగర్‌ అవినీతి నిరోధకశాఖ అధికార్లకు ఫిర్యాదు చేశాడు. గురువారం గుంటూరులోని బృందావన్‌గార్డెన్‌ సెంటర్‌లో ఎస్‌బీఐ ఎదురుగా వీరాస్వామి రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో భూగర్భ గనుల శాఖలో కలకలం రేగింది. విజిలెన్స్‌ స్క్వాడ్‌లో పనిచేస్తున్న వీరాస్వామే పట్టుబడటంతో ఆయా కార్యాలయాలలో ఉన్న ఉద్యోగులు ఉలికిపాటుకు గురయ్యారు.

Updated Date - 2020-07-10T20:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising