ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కందుకూరులో యువకుడి అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2020-12-07T03:52:58+05:30

కందుకూరు పట్టణంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జనార్దన కాలనీలో నివాసం ఉండే మస్తాన్‌(45) ముత్యాలకుంట సమీపంలో ఉన్న శ్మశానం ఎదురు చిల్ల పొదల్లో శవమై పడి ఉన్నాడు.

అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మస్తాన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


హత్య కోణంలో పోలీసుల విచారణ 

కందుకూరు, డిసెంబరు 6 : పట్టణంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జనార్దన కాలనీలో నివాసం ఉండే మస్తాన్‌(45) ముత్యాలకుంట సమీపంలో ఉన్న శ్మశానం ఎదురు చిల్ల పొదల్లో శవమై పడి ఉన్నాడు. ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మస్తాన్‌ని శ్మశానం ఎదురుగా ఉన్న సిమెంటు రోడ్డుపై నుంచి చిల్లపొదల్లోకి లాక్కెళ్లిన ఆనవాళ్లు కనిపిస్తుండటంతోపాటు అతని మొహంపై, మరికొన్నిచోట్ల గాయాలున్నాయి. వీటినిబట్టి అతనిది హత్యేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఉంటుందని తొలుత అంచనా వేసిన పోలీసులు క్లూస్‌ టీం వచ్చాకమరికొన్ని ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. దీంతో అతను హత్య గావించబడ్డాడన్న నిర్థారణకు వచ్చి ఆ దిశగా విచారణ  చేస్తున్నారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న మస్తాన్‌ ప్రస్తుతం వారిద్దరితో సంబంధం లేకుండా ఒంటరిగా జీవిస్తున్నాడు. గతంలో ఎలక్ర్టీషియన్‌గా పనిచేసిన అతను ప్రస్తుతం మద్యానికి బానిసై పనిలేకుండా తిరుగుతున్నట్లు చెబుతున్నారు. శనివారంరాత్రి పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో ఇద్దరు యువకులతో కలిసి అతను మద్యం సేవించాడని పోలీసులు నిర్థారించారు. ఆ ఇద్దరు యువకులు ఎవరనేది తేలితే మస్తాన్‌ మృతికి కారణం తేలుస్తుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించి సీఐ విజయకుమార్‌ నేతృత్వంలో ఎస్‌ఐ కె.కె.తిరుపతిరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-12-07T03:52:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising