ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవులవారిపాలెంలో విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-11-14T01:52:11+05:30

ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని ఆవులవారిపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది.

విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందిన వీరరాఘవులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆవులవారిపాలెం(గుడ్లూరు), నవంబరు 13 : ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని ఆవులవారిపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామంలోని పట్టపుపాలేనికి చెందిన ఆవుల వీరరాఘవులు(35) గ్రామానికి సమీపంలో ఉన్న రొయ్యల పెంపకం హేచరీ దగ్గర కూలీగా పనిచేస్తుంటాడు. హేచరీలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగగా సమీపంలో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫారం దగ్గరకు వెళ్లి సరిచేశాడు. ఇంతలో పక్కగా ఉన్న సీహెచ్‌ గోవిందుకు సంబంధించిన విద్యుత్‌ మోటర్‌ వద్ద షాక్‌ తగిలి గొర్రె మృతి చెంది ఉండడాన్ని వీరరాఘవులు గమనించాడు. గోవిందుకు సంబంధించిన మోటర్‌ కరెంటును నిలుపుదల చేసే క్రమంలో ట్రాన్స్‌ఫారం వద్ద తెగి ఉన్న విద్యుత్‌ తీగను గమనించకుండా కాలుతో తొక్కాడు. దీంతో షాక్‌ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. భార్య తిరుపతమ్మతో పాటు ఇద్దరు కుమారులు అశోక్‌,  మహేంద్రలు తండ్రి శవాన్ని చూసి బోరున విలపించారు. ఏఎ్‌సఐ మురళీధర్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.


Updated Date - 2020-11-14T01:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising