200 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
ABN, First Publish Date - 2020-03-16T11:15:14+05:30
ప్రభు త్వం పేద ప్రజలకు కిలో రూపా యికే రేషన్ బియ్యం అందిస్తున్నది. ఈ బియ్యం నేరుగా
వేటపాలెం, మార్చి 15: ప్రభు త్వం పేద ప్రజలకు కిలో రూపా యికే రేషన్ బియ్యం అందిస్తున్నది. ఈ బియ్యం నేరుగా లబ్ధిదారులకు చేరాలనే సదుద్దేశంలో బయోమెట్రిక్ విధానం ద్వారా అందజేస్తున్నారు. అయితే, రేషన్ షాపు డీలర్లు ఈ బి య్యాన్ని అక్రమంగా విక్రయిస్తూ సొ మ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవ హారం తేలిసినప్పటికీ రెవెన్యూ అ ధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరిస్తున్నారనే ఆరోపణలు వస్తు న్నాయి.
ఈక్రమంలో వేటపాలెం బైపాస్ రోడ్లులో నెంబర్ ఎపీ 27 ఎక్స్ 3246 గల లారీలో 50 కిలోల రేషన్ బియ్యం బస్తాలతో అక్రమంగా తర లిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై అజ య్‌బాబు ఆదివారం పట్టుకొని లారీని స్వాధీనం చేసుకున్నారు.. ఈ రేషన్ బియ్యం వేటపాలెం రేషన్ దుకాణాల నుంచి సేకరించి అక్రమంగా త రలిస్తున్నట్లు గుర్తించారు. ఏ షాపు నుంచి ఎంత బియ్యం తరిస్తున్నారనే దానిపై పూర్తి స్థాయిలో సమాచారం రావల్సి ఉంది. లారీ డ్రైవర్ రమేష్‌ని అరెస్టు చేసి కేసున మోదు చేసి దర్మాప్తు చేస్తున్న ట్లు ఎస్సై తెలిపారు.
Updated Date - 2020-03-16T11:15:14+05:30 IST