ప్రకాశం: గ్రానైట్ రాళ్ల తరలింపులో నిర్లక్ష్యం
ABN, First Publish Date - 2020-09-14T14:06:30+05:30
గ్రానైట్ రాళ్ళ తరలింపులో నిర్లక్ష్యం కారణంగా లారీపై నుంచి భారీ గ్రానైట్ రాళ్లు జారి రోడ్డుపై పడిపోయాయి.
ప్రకాశం: గ్రానైట్ రాళ్ళ తరలింపులో నిర్లక్ష్యం కారణంగా లారీపై నుంచి భారీ గ్రానైట్ రాళ్లు జారి రోడ్డుపై పడిపోయాయి. ఒంగోలు బైపాస్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రానైట్ రాళ్లు పడిన సమయంలో వాహనాల రాకపోకలు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రానైట్ రాళ్లను చీమకుర్తి నుండి నెల్లూరుకు తీసుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గ్రానైట్ రాళ్ల తొలగింపు చర్యలు చేపట్టారు.
Updated Date - 2020-09-14T14:06:30+05:30 IST