జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ నేటికి వాయిదా
ABN, First Publish Date - 2020-11-03T09:38:32+05:30
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ మంగళవారానికి వాయిదాపడింది. ఆ కేసులపై సోమవారం
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ మంగళవారానికి వాయిదాపడింది. ఆ కేసులపై సోమవారం ఎలాంటి విచారణ జరగకుండానే వాయిదావేశారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను రోజువారీ విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో గత నెల నుంచి ప్రత్యేకంగా నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత నేపథ్యంలో విచారణను వీడియో కాన్పరెన్స్‌లో చేపడుతున్నారు. జగన్‌పై సీబీఐ దాఖలు చేసిన 11 కేసులతో పాటు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాఖలు చేసిన మరో 5 కేసులపైనా విచారణ నడుస్తోంది. జగన్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.
Updated Date - 2020-11-03T09:38:32+05:30 IST