ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వేళ.. ఇళ్ల స్థలాల పేరుతో జగన్ రాజకీయం

ABN, First Publish Date - 2020-04-10T01:41:38+05:30

పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వచ్చిన సీఆర్డీఏ సిబ్బందిని మందడం గ్రామ రైతులు అడ్డుకున్నారు. కరోనా వైరస్ కారణంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: 'పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో భాగంగా రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వచ్చిన సీఆర్డీఏ సిబ్బందిని మందడం గ్రామ రైతులు అడ్డుకున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమల్లో ఉండగా భౌతిక దూరం పాటించకుండా అభిప్రాయ సేకరణ ఎలా చేస్తారంటూ రైతులు ప్రశ్నించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను, భూసేకరణ పేరిట ఇబ్బందులు పెట్టడం సబబుకాదని అంటున్నారు. రైతులకిచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయకుండా పేదలకు స్థలాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని రైతులు విమర్శించారు. లాక్‌డౌన్ తర్వాత తమ అభిప్రాయాలను చెబుతామని రైతులు స్పష్టం చేయడంతో సీఆర్డీఏ సిబ్బంది వెనుతిరిగారు. ఓ పక్క కరోనా భయంతో జనాలు చస్తుంటే జీవచ్ఛవాలాంటి ప్రజల భయంపై చిల్లర ఏరుకోవడానికి వైసీపీ ప్రభుత్వం అధికారులతో చేయించిన ఈ పని దారుణ విమర్శలపాలయింది. ‘కొంప కొల్లేరు అయి ఏడుస్తుంటే’.. ఇల్లు ఇస్తానని సీఎం జగన్ చేస్తున్న రాజకీయం చేతబడిలా ఇది ఉందని కొందరు విమర్శలు చేస్తున్నారు. 

Updated Date - 2020-04-10T01:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising