ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రాయపాటి శైలజకు నోటీసులు

ABN, First Publish Date - 2020-08-19T00:21:53+05:30

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌లోని కోవిడ్ సెంటర్‌లో చోటుచేసుకున్న అగ్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌లోని కోవిడ్ సెంటర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం విదితమే. ఇప్పటికే ఈ కేసులో పలువుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరికొందరికి నోటీసులిచ్చి విచారిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివారావు కోడలు డాక్టర్‌ మమతకు నోటీసులిచ్చిన పోలీసులు విచారించారు. కోవిడ్ కారణంగా గ్యాప్ ఇచ్చిన పోలీసులు మరోసారి విచారిస్తామని తెలిపారు. అయితే నోటీసుల పర్వం మాత్రం ఇంకా ఆగలేదు.


హాస్పిటల్‌కు నేనే వస్తా!

తాజాగా.. రమేశ్ ఆస్పత్రి చైర్మన్‌ రామ్మోహన్‌రావు కోడలు రాయపాటి శైలజకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలంటూ శైలజకు నోటీసులిచ్చారు. కోవిడ్ కారణంగా గుంటూరులోని శైలజ నివాసంలోనే విచారిస్తామని కూడా పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ నోటీసులపై స్పందించిన శైలజ.. విచారణ నిమిత్తం తాను గుంటూరులోని రమేశ్ హాస్పిటల్‍కు వస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి ప్రత్యేక పోలీస్ బృందం గుంటూరుకు బయల్దేరింది. శైలజ స్టేట్మెంట్ రికార్డు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. రాయపాటి శైలజా స్టేట్మెంట్ కోరడంపై సర్వత్రా చర్చంశనీయాంశమైంది.


రాయపాటి ఫ్యామిలీపై ఫోకస్!

మొత్తానికి చూస్తే.. ఇప్పటికే రాయపాటి కోడలు మమతకు నోటీసులిచ్చి విచారించిన పోలీసులు.. తాజాగా రాయపాటి శైలజా నోటీసులివ్వడాన్ని బట్టి చూస్తే రాయపాటి కుటుంబపైనే ప్రభుత్వం పోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడి మమత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ కమిషనర్ ఆఫీసుకు రప్పించి మరీ డాక్టర్ మమతను పోలీసులు విచారించారు. కాగా.. రాయపాటి సాంబశివరావు తమ్ముడు కుమార్తె శైలజ. ఈమె అమరావతి ఉద్యమంలో కూడా కీలకంగా ఉన్నారు.


మరోవైపు.. ఈ ఘటనలో అరెస్ట్ అయిన  ముగ్గురు నిందితుల‌ు బెయిల్ పిటిషన్‌, డాక్టర్ ముందస్తు బెయిల్ పిటిషన్, కస్టడీ.. మూడింటిపైన 21న మూడో అద‌న‌పు చీఫ్ మెట్రోపాలిట‌న్ కోర్టు విచారించనుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2020-08-19T00:21:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising