పోలీసుల అదుపులో ‘మద్యం’ నిందితులు?
ABN, First Publish Date - 2020-03-16T09:35:00+05:30
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఇంట్లో అర్ధరాత్రి మద్యం సీసాలు పెట్టిన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పురపాలక ఎన్నికల్లో 4వ వార్డు నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న
తెనాలి అర్బన్, మార్చి 15: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఇంట్లో అర్ధరాత్రి మద్యం సీసాలు పెట్టిన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పురపాలక ఎన్నికల్లో 4వ వార్డు నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న అడుసుమల్లి వెంకటేశ్వరరావు ఇంటిలో ఇద్దరు అగంతకులు ప్రవేశించి మద్యం సీసాల బాక్సు ఉంచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరుసటి రోజే ప్రభుత్వ మద్యం దుకాణం నిర్వాహకుని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సంఘటన జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ సంచలనం కలిగించడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై టూ టౌన్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అభ్యర్థి ఇంట్లో ప్రవేశించిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
Updated Date - 2020-03-16T09:35:00+05:30 IST