ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ అభ్యర్థి కోసం పోలీసుల వేట

ABN, First Publish Date - 2020-03-13T10:27:57+05:30

గుంటూరు జిల్లా మాచర్ల జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి తన నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని వైసీపీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నాయి. అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడి ఈ స్థానానికి టీడీపీ తరఫున నామినేషన్‌ వేసేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా మాచర్ల జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి తన నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని వైసీపీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నాయి. అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడి ఈ స్థానానికి టీడీపీ తరఫున నామినేషన్‌ వేసేందుకు స్థానికులు ఎవరూ ముందుకురాలేదు. నాగార్జున సాగర్‌ వాసి, హైదరాబాద్‌లో ఉండే న్యాయవాది చందులాల్‌ నాయక్‌ టీడీపీ తరఫున బరిలోకి దిగేందుకు ముందుకొచ్చారు. ఆయనకు ఇక్కడ ఓటు ఉండడంతో నామినేషన్‌ ఆమోదం పొందింది. ఏకగ్రీవంగా గెలుపొందాలని భావించిన వైసీపీ శ్రేణులు నామినేషన్‌ను ఉపసంహరిచుకోవాలని బెదిరించారు. బరిలో నిలవాలనే ఉద్దేశంతో చందులాల్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం వైసీపీ నాయకులతో పాటు సుమారు 25మంది పోలీసులు అన్వేషిస్తున్నట్లు తెలిసింది. చందులాల్‌ కుటుంబీకులను అదుపులోకి తీసుకుని అతని ఆచూకీ చెబుతారా, చంపేయమంటారా అని బెదిరిస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2020-03-13T10:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising