ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు గడ్డపై పింగళి జన్మించడం మన అదృష్టం: పవన్

ABN, First Publish Date - 2020-08-02T21:11:50+05:30

జాతీయ పతాకాన్ని తీర్చిదిద్ది భారతీయుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు పింగళి వెంకయ్య...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జాతీయ పతాకాన్ని తీర్చిదిద్ది భారతీయుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు పింగళి వెంకయ్య అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆ స్ఫూర్తి ప్రదాత జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా అంజలి అర్పిస్తున్నానని ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు గడ్డపై పింగళి జన్మించడం మన అదృష్టమని, కృష్ణా నదీ పరివాహక ప్రాంతమైన కృష్ణా జిల్లాలో జన్మించి ఆ నేలపై నుంచే త్రివర్ణ పతాకాన్ని ఆయన రూపొందించడం తెలుగువారికి గర్వకారణమన్నారు. అతి నిరాడంబర జీవితాన్ని గడిపిన ఈ స్వతంత్ర సమరయోధుని కీర్తి మువ్వన్నెల పతాకం నీడలో అజరామరంగా విరాజిల్లుతూనే ఉంటుంది.  ఆయన త్యాగ నిరతి, ఆ చిరునవ్వులు తెలుగువారి జ్ఞాపకాలలో ఈ నేల ఉన్నంత వరకూ పదిలంగా ఉంటాయన్నారు. 

Updated Date - 2020-08-02T21:11:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising