నాని పేరెత్తాలంటే పవన్‌కు భయం.. అందుకే..: పేర్ని
ABN, First Publish Date - 2020-12-29T22:08:48+05:30
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ల వర్షం కురిపించారు.
అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ల వర్షం కురిపించారు. సోమవారం నాడు గుడివాడ పర్యటనలో పవన్ మాట్లాడిన ప్రతీ మాటకు నాని స్పందిస్తూ కౌంటరిచ్చారు. ‘సహస్రకోటి నాయుడుల్లో నువ్వొక బోడి నాయుడివి. ఇంతకీ ఈయన ఎప్పుడు వకీల్ అయ్యాడు..? ఏ యూనివర్శిటీలో వకీల్ చదివాడు..?. జనం పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. పవన్‌ది అంతా సెట్టింగ్‌లు, ప్యాకప్‌లు వ్యవహారమే’ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.
కొడాలి పేరెత్తాలంటే భయం..!
‘కొడాలి నాని పేరు ఎత్తాలంటే నీకు (పవన్) భయం. అందుకే గుడివాడలో కొడాలి పేరెత్తాడా..?.. లేదు. ఎవరో ఎమ్మెల్యేనో, ఎవరో మంత్రో నీకు తెలియదు..?. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరో కూడా తెలియకుండా రాజకీయం చేస్తున్నాడు. షూటింగ్‌లు లేకపోతేనే పవన్‌కు జనం గుర్తుకొస్తారు. పవన్‌ను నమ్ముకున్న తుళ్లూరు రైతులు నట్టేట మునిగిపోయారు. చంద్రబాబుకు తప్ప పవన్ ఎవరికైనా అండగా నిలబడ్డాడా..?. ఇంతకీ సినిమాలు మానేయమని చిడతల నాయుడికి ఎవరు చెప్పారు..? వందల కోట్ల సంపాదన వదులుకుని వస్తున్నానని చెప్పింది చిడతల నాయుడు కాదా..?. ఏడాదికొకరికి చిడతలు వాయించేది పవనే. పవన్ ఆటలో అరటిపండు. మా ఇంటికొస్తే పచ్చడి అన్నమే.. చంద్రబాబు ఇంటికెళ్తే సూట్ కేసు’ అంటూ పవన్‌పై పేర్ని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
మోదీ సాబ్‌కు చెప్పండి..!
‘నేను ఏది చేసినా వైఎస్ కుటుంబానికే చేస్తా. నాది స్వామి భక్తి.. చచ్చిపోతూ కూడా వైఎస్‌కే భజన చేస్తా. డబ్బుల కోసం చిడతలు కొట్టేవాడ్ని కాదు. జనాల్లోకి రావడం, ధర్నాలు చేయడం పవన్‌కు వ్యాపారం. తుఫాన్‌లతో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చాం. గత ప్రభుత్వం బకాయిలను కూడా చెల్లించాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలూ జమ చేశాం. 18నెలల్లో రైతుల కోసం రూ.61 వేల 400 కోట్లు ఖర్చు చేశాం. పంటనష్టపోతే మీ జాయింట్ ప్రభుత్వంలో రైతులకు ఎంత ఇప్పించావు. ప్రధాని మోదీ రూ.2వేలు ఇస్తే వైఎస్ జగన్ రూ.7500 ఇస్తున్నారు. కౌలు రైతులకు కూడా న్యాయం చేయమని ఈ నకిలీ వకీల్ సాబ్ చెప్పాలి. గిరిజన, అసైన్డ్ రైతులకు కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు. పవన్ వకీల్ అన్నది ఎంత నిజమో.. రైతుల పట్ల ఆయన చేసిన పోరాటం కూడా అంతే నిజం. నకిలీ వకీల్ సాబ్.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వమని మోదీ సాబ్‌కు చెప్పండి’ అని పవన్‌కు పేర్ని నాని సూచించారు. వైసీపీ మంత్రుల వరుస కౌంటర్లపై పవన్ కల్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారా అని జనసేన కార్యకర్తలు, వీరాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Updated Date - 2020-12-29T22:08:48+05:30 IST