ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో పది రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: డీజీపీ

ABN, First Publish Date - 2020-04-03T20:49:43+05:30

మరో పది రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ సూచించారు. కరోనా కేసుల విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తే శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మరో పది రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ సూచించారు. కరోనా కేసుల విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తే శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో చెక్‌పోస్ట్‌ల వద్ద పరిస్థితిపై డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. ఢిల్లీ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారితో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ఢిల్లీ సమావేశాలకు వెళ్లిన వారంతా స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే జాబితా ఆధారంగా చాలా మందిని ఆస్పత్రికి తరలించామని, ఏపీ నుంచి 1085 మంది ఢిల్లీ సమావేశానికి వెళ్లినట్లు అధికారికంగా తేలిందని తెలిపారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఆలస్యం అయ్యే కొద్దీ ప్రాణాలు కోల్పొతారు..ముందే మేల్కొని ఆస్పత్రికి రావాలని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు తప్పవని సూచించారు. యూకేలో చిక్కుకున్న మన విద్యార్థులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బాపట్లలో వ్యక్తి ఆత్మహత్యపై విచారణ చేస్తున్నామని, సీఎం జగన్ కూడా ఆరా తీశారని తెలిపారు. పోలీసు సిబ్బంది కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని సవాంగ్ హితవుపలికారు.

Updated Date - 2020-04-03T20:49:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising