ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల పింఛన్లు, జీతాలు 3 తర్వాతే!

ABN, First Publish Date - 2020-07-01T08:20:17+05:30

రాష్ట్రంలో జూలై నెలకు సంబంధించిన లబ్ధిదారుల పింఛన్లు, ఉద్యోగుల జీతాల చెల్లింపులు మూడో తేదీ తర్వాతే జరగనున్నాయి. 1, 2 తేదీల్లో చెల్లింపులు జరిగే అవకాశం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌  30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జూలై నెలకు సంబంధించిన లబ్ధిదారుల పింఛన్లు, ఉద్యోగుల జీతాల చెల్లింపులు మూడో తేదీ తర్వాతే జరగనున్నాయి. 1, 2 తేదీల్లో చెల్లింపులు జరిగే అవకాశం లేదు. బడ్జెట్‌కి సంబంధించిన అప్రాప్రియేషన్‌  బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందక పోవడంతో నిధుల వినియోగానికి సంబంధించిన ఇబ్బంది ఏర్పడింది. అయితే, ఇది ద్రవ్యబిల్లు కావడంతో చట్ట సభల ఆమోదం లేకున్నా.. 14 రోజుల తర్వాత ఈ బిల్లును ఆమోదం పొందినట్లుగా భావిస్తారు. ద్రవ్యబిల్లును జూన్‌  17న మండలిలో ప్రవేశ పెట్టారు. కాబట్టి జూలై 1కి 14 రోజులు పూర్తవుతాయి. దీనిని బట్టి.. 2వ తేదీన బిల్లును ఆమోదం కోసం గవర్నర్‌కి పంపనున్నారు. ఆ రోజు గవర్నర్‌ ఈ బిల్లును ఆమోదిస్తే 3వ తేదీ నుంచి బడ్జెట్‌ అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఒక జీవో జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో 1, 2 తేదీల్లో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌ లతో సహా ఇతర చెల్లింపులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. 


Updated Date - 2020-07-01T08:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising