ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్ మా ప్రభుత్వానికి స్ఫూర్తి ప్రదాత: పెద్దిరెడ్డి

ABN, First Publish Date - 2020-07-08T16:56:44+05:30

విజయవాడ: వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి సందర్భంగా విజయవాడ కంట్రోల్ రూం వద్ద విగ్రహానికి పూల మాల వేసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి సందర్భంగా విజయవాడ కంట్రోల్ రూం వద్ద విగ్రహానికి పూల మాల వేసి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ... వైఎస్ 71వ జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లో వేడుకలు జరుపుతున్నామన్నారు. తమ ప్రభుత్వానికి స్ఫూర్తి ప్రదాత రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.


అయన ఆశయ సాధన కోసం జగన్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ మరింత ముందుకు వెళ్తామని జగన్ చెప్పారని పెద్దిరెడ్డి తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ఆత్మ వైసీపీకి మద్దతుగా ఉంటుందన్నారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ... ఈ రోజును రైతు దినోత్సవంగా ప్రకటించామన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని.. రాజన్న పథకాలకు పేర్లు మార్చి టీడీపీ పబ్బం గడుపుకుందని వెల్లంపల్లి తెలిపారు.

Updated Date - 2020-07-08T16:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising